Mahesh Babu: మహేష్ బాబు క్రేజ్ కు నిదర్శనం ఇదే!

ఈ నెల 9వ తేదీన మహేష్ బాబు పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఎంపిక చేసిన థియేటర్లలో పోకిరి మూవీ రీరిలీజ్ కానుంది. మహేష్ బాబు కెరీర్ లోని బిగ్గెస్ట్ హిట్లలో పోకిరి సినిమా ఒకటనే సంగతి తెలిసిందే. అప్పట్లోనే ఈ సినిమా 40 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సొంతం చేసుకుని సంచలనాలను సృష్టించింది.

మహేష్ బాబు సొంత థియేటర్ అయిన ఏఎంబీ సినిమాస్ పోకిరి మూవీ స్పెషల్ షో ఈ నెల 9వ తేదీన సాయంత్రం 7 గంటలకు ప్రదర్శితం కానుండగా కేవలం రెండే రెండు నిమిషాలలో ఈ సినిమాకు సంబంధించిన టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం 120 సెకన్లలో ఒక షోకు సంబంధించిన టికెట్లు అమ్ముడవటం అంటే ఒక విధంగా రికార్డ్ అనే చెప్పాలి. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాతో మహేష్ మాస్ ఫ్యాన్స్ లో ఫాలోయింగ్ పెరిగింది.

మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించగా ఈ సినిమాలోని అన్ని పాటలు హిట్టయ్యాయి. మహేష్ కు జోడీగా ఇలియానా ఈ సినిమాలో నటించగా ప్రకాష్ రాజ్, నాజర్, అశిష్ విద్యార్థి పాత్రలు సైతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మహేష్ సొంత థియేటర్ లో పోకిరి రీ రిలీజ్ అవుతుండటం మహేష్ ఫ్యాన్స్ కు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తోంది. 15 సంవత్సరాల క్రితం సినిమాతో కూడా మహేష్ రికార్డులు క్రియేట్ చేస్తుండటం గమనార్హం.

మహేష్ బాబు భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు. మహేష్ త్వరలో త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీపై భారీగా అంచనాలు నెలకొనగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus