Mahesh Babu: సర్కారు వారి పాట కోసం మహేష్ న్యూ టార్గెట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాటతో అభిమానులకు సరికొత్త కిక్ ఇచ్చేలా ఉన్నాడని అనిపిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సరికొత్త స్టైల్లో కనిపిస్తున్నా ప్రిన్స్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తాడని చిత్రయూనిట్ చాలా నమ్మకంతో ముందడుగు వేస్తోంది. ఇప్పటికే దర్శకుడు ఈ సినిమా కు సంబంధించిన ముఖ్యమైన పనులు అన్నిటిని కూడా ఫినిష్ చేశాడు. ఇటీవల కీలకమైన బార్సిలోనా షెడ్యూల్‌ను కూడా పూర్తి చేశారు.

ఇక ఈ 3 వారాల సుదీర్ఘ షెడ్యూల్‌లో, టీమ్ అనేక ముఖ్యమైన టాకీ సన్నివేశాలను అలాగే మహేష్, కీర్తి నటించిన ఒక పాటను రూపొందించింది. ఒకటి రెండు రోజుల్లో SVP టీమ్ హైదరాబాద్‌కు తిరిగి రానుంది. చిన్న బ్రేక్ తర్వాత నవంబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌లో షూటింగ్‌ను పునఃప్రారంభించనున్నారు. ఇక నవంబర్‌లో చివరి వారంలో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. పక్కా ప్లాన్ తోనే మహేష్ ఈ టార్గెట్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ ఫార్మాలిటీస్ జరుగుతుండగా డిసెంబర్ లో పూర్తి స్థాయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఫినిష్ కానున్నాయి. పరశురామ్ దర్శకత్వం వహించిన సర్కారు వారి పాట సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ అలాగే 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీని విడుదల చేయనున్నారు.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus