టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) తర్వాత ఇంకో సినిమా చేసే అవకాశం లేదు. ఎందుకంటే నెక్స్ట్ సినిమా రాజమౌళితో కమిట్ అయ్యాడు కాబట్టి.! ఆ సినిమా కచ్చితంగా 2027 వరకు వచ్చే అవకాశం లేదు. పైగా స్కేల్ ఇంకా పెరిగితే 2028 వరకు టైం పట్టొచ్చు. అంటే దాదాపు 4 ఏళ్ళ వరకు మహేష్ కనిపించడు అని అంతా ఫిక్స్ అయిపోయారు. అందుకే రాజమౌళి (S. S. Rajamouli) సినిమా కోసం మహేష్ మేకోవర్ పిక్స్, పలు ఫంక్షన్లలో మహేష్ సందడి చేసిన వీడియోలు..
Mahesh Babu
వంటివి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తూ ఆనంద పడిపోతున్నారు అభిమానులు. మరోపక్క మహేష్ బాబు పాత సినిమాలు.. అతని పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేస్తుండటం.. అవి భారీ ఓపెనింగ్స్ రాబట్టడం వంటివి కూడా చూస్తూనే ఉన్నాం. ఈ రికార్డులు చూసుకుని కూడా ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. వాళ్ళు మాత్రమే కాదు మహేష్ బాబు కూడా మురిసిపోతున్నాడు అని స్పష్టమవుతుంది. విషయం ఏంటంటే.. నిన్న అశోక్ గల్లాతో (Ashok Galla) కలిసి ట్విట్టర్లో ‘#ASK’ సెషన్లో పాల్గొన్నాడు మహేష్.
ఈ క్రమంలో తన సినిమాల రీ రిలీజ్..ల ప్రస్తావన వచ్చింది. ఈ క్రమంలో మహేష్ బాబు తన రీ రిలీజ్ సినిమాల పై స్పందిస్తూ.. ” ‘పోకిరి’ (Pokiri) నుండి ఈ ట్రెండ్ మొదలైంది. నా పాత రీ రిలీజ్ అవ్వడం, అవి మంచి కలెక్షన్స్ ను రాబట్టడం.. అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అలాగే నన్ను గతంలోకి తీసుకెళ్తుంది. నా రీ రిలీజ్ సినిమాలని కూడా ఎక్కడో కూర్చో పెడుతుంది. అలాంటి అభిమానులు ఉన్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు మహేష్.