టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మహేష్ బాబు గత కొన్నేళ్లుగా ఏ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఆ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధిస్తూ మంచి లాభాలను అందిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా భారీ బడ్జెట్ తో సినిమాలను నిర్మించడానికి దర్శకనిర్మాతలు సైతం సిద్ధంగా ఉన్నారు. ఒక ఇంటర్వ్యూలో మహేష్ మాట్లాడుతూ తెలుగులోనే ఉంటూ మధ్యలో ఇంగ్లీష్ డైలాగ్స్ వస్తే ఇష్టమని ఆయన అన్నారు. సినిమా బాగుంటేనే నా కుటుంబ సభ్యులు రియాక్ట్ అవుతారని సినిమా నచ్చకపోతే అస్సలు స్పందించరని మహేష్ పేర్కొన్నారు.
మల్టీస్టారర్స్ అనేది మంచి ట్రెండ్ అని ఆయన తెలిపారు. అందరు హీరోలు ఒకరితో ఒకరు ఫ్రెండ్లీగా ఉంటారని మహేష్ కామెంట్లు చేశారు. నేను నటించిన సినిమాలలో ఆడని సినిమాలన్నీ చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని అనిపిస్తుందని మహేష్ తెలిపారు. సినిమాలకు సంబంధించి ఎక్కడో ఒకచోట మిస్టేక్స్ జరుగుతాయని మహేష్ పేర్కొన్నారు. నాకు రాజకీయాలు అంటే తెలియదని ఆయన కామెంట్లు చేశారు. రాజకీయాలు నాకు సంబంధం లేని విషయం అని మహేష్ చెప్పుకొచ్చారు.
పొలిటికల్ సినిమాల్లో నటిస్తానని అయితే రాజకీయాల్లోకి రావాలని మాత్రం లేదని మహేష్ ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. నాకు తెలుగు చదవడం రాదని మహేష్ పేర్కొన్నారు. అయితే మహేష్ ఒక్కసారి విన్న డైలాగ్ ను మాత్రం మరిచిపోరని ఆయనతో పని చేసిన డైరెక్టర్లు చెబుతారు. మహేష్ కుటుంబానికి ఏ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారో సినిమాలకు అదే స్థాయిలో ప్రాధాన్యత ఇస్తారు.
మహేష్ పారితోషికం ప్రస్తుతం 70 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది. మహేష్ కెరీర్ పరంగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?