Mahesh Babu, Rajamouli: రాజమౌళి సినిమాలో ఐశ్వర్యారాయ్ రోల్ ఇదేనా?

మహేష్ జక్కన్న కాంబినేషన్ లో సినిమా మొదలుకావడానికి మరో ఏడు నెలల సమయం ఉంది. ఈ సినిమాకు సంబంధించి కథ కూడా ఫైనల్ కాలేదని అటు రాజమౌళి ఇటు మహేష్ బాబు క్లారిటీ ఇచ్చారు. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి అంతకు మించి అధికారికంగా ఎలాంటి అప్డేట్ లేదు. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ జక్కన్న మూవీకి సంబంధించి అధికారిక ప్రకటన వస్తుందని ఫ్యాన్స్ భావించినా ఆ విధంగా జరగలేదు.

అయితే మహేష్ జక్కన్న కాంబో మూవీలో కీలక పాత్రకు ఐశ్వర్యారాయ్ ఎంపికయ్యారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. మహేష్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాను పూర్తి చేసి ఈ సినిమాపై దృష్టి పెట్టనున్నారు. బాహుబలి సినిమాలో శివగామి తరహా పాత్రలో ఐశ్వర్యా రాయ్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో రాజమౌళి భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

ఆఫ్రికన్ జంగిల్ నేపథ్యంలో మహేష్ సినిమాను తెరకెక్కిస్తానని ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా జక్కన్న చెప్పుకొచ్చారు. ఐశ్వర్యా రాయ్ ఈ సినిమాలో నటిస్తే ఈ సినిమా రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అని చెప్పవచ్చు. వైరల్ అవుతున్న వార్తల గురించి ఐశ్వర్యారాయ్ స్పందిస్తారో లేదో చూడాల్సి ఉంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కనుంది. 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఈ సినిమా కోసం అవసరమైతే రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయించడానికి సిద్ధమేనని మహేష్ బాబు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus