Mahesh Babu: సర్కారు పాట సీక్రెట్స్ చెప్పేసిన మహేష్!

స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2022 సంవత్సరం జనవరి 13వ తేదీన రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 70 శాతం పూర్తైంది. సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబు మరింత స్టైలిష్ గా కనిపిస్తుండగా ఈ సినిమాతో మహేష్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

తాజాగా మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా గురించి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. కేవలం ఒక్క సిట్టింగ్ లోనే సర్కారు వారి పాట సినిమాకు ఓకే చెప్పానని మహేష్ బాబు తెలిపారు. సర్కారు వారి పాట సినిమా కథ తనకు ఎంతో నచ్చిందని సర్కారు వారి పాట పోకిరికి ఏ మాత్రం తగ్గదని మహేష్ బాబు వెల్లడించారు. ఈ సినిమా ఖచ్చితంగా పోకిరి వైబ్స్ ను తీసుకొస్తుందని మహేష్ బాబు పేర్కొన్నారు.

తనకు సినిమా కథ కోసం ఎక్కువ సిట్టింగ్స్ వేయడం నచ్చదని మహేష్ బాబు వెల్లడించారు. త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాత తాను రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తానని మహేష్ బాబు అన్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజమౌళి మహేష్ కాంబో మూవీ 2022 సెకండాఫ్ లో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

లవ్ స్టోరీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus