అభిమానుల భోజనాల కోసం మహేష్ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాడంటే..?

  • November 29, 2022 / 02:30 PM IST

‘‘నాన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు.. అందులో గొప్పది మీ అభిమానం.. అందుకు ఆయనకు రుణపడి ఉంటాను.. నాన్న గారు ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు.. మీ గుండెల్లోనూ ఉంటారు.. ఆయన ఎప్పుడూ మన మధ్యే ఉంటారు.. మీ అభిమానం, ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలని కోరుకుంటున్నాను’’ అంటూ తండ్రి కృష్ణ దశ దిన కార్యక్రమానికి వచ్చిన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఫ్యాన్స్ అంటే తనకు ఎంతిష్టమో ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు మహేష్.

తండ్రి నుండి వారసత్వంగా నటనతో పాటు లక్షలాది అభిమానుల ప్రేమ కూడా దొరికిందని అంటుంటాడు. అందుకే వారికోసం, కష్టాల్లో ఉన్నవారి కోసం ఇప్పటికే గ్రామాల దత్తత, చిన్నారులకు హార్ట్ సర్జరీల వంటి పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నవంబర్ 27న కృష్ణ గారి పెద్ద కర్మను ఘనంగా నిర్వహించారు ఘట్టమనేని కుటుంబ సభ్యులు. కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు, మహేష్‌కి తోడుగా ఉంటూ అన్ని ఏర్పాట్లూ చూసుకున్నారు.

సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఎన్ కన్వెన్షన్, తండ్రికి నివాళులు అర్పించడానికి వచ్చే అభిమానుల కోసం జేఆర్‌సీ కన్వెన్షన్‌లో భారీ ఏర్పాట్లు చేశారు. కృష్ణ స్వస్థలం బుర్రిపాలెం, తెనాలి, గుంటూరు జిల్లా నుండి హాజరయ్యే దాదాపు 5 వేల మంది అభిమానులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందుగానే పాసులు జారీ చేశారు. అలాగే వెజ్, నాన్ వెజ్ కలిపి ఏకంగా 32 రకాల వంటకాలతో రుచికరమైన భోజనాలు పెట్టారు. తృప్తిగా, కడుపునిండా భోజనం చేసిన తర్వాత..

తమ కోసం మహేష్ పెట్టిన ఫుడ్ గురించి మీడియాకి చెప్తూ హ్యాపీగా ఫీలయ్యారు ఫ్యాన్స్.. అభిమానుల భోజనాల కోసం మహేష్ బాబు అక్షరాలా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారట. కృష్ణ మరణంతో వీరాభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కడసారి చూసుకోవడానికి రాలేకపోయిన వారు పెద్ద కర్మ కార్యక్రమానికి విచ్చేసి.. ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఇందుకు సంబంధించిన పిక్స్, వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus