#SSMB28మే 31న ముఖ్యంగా అభిమానులకు ఆ అప్డేట్ కావాలట..!

మహేష్ బాబు వరుసగా మూడు హిట్లు కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ‘భరత్ అనే నేను’ ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ అయ్యాయి. అయితే అభిమానులకు ఓ చిన్న లోటు ఉండిపోయింది. ‘మహర్షి’ ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయినా ఆ చిత్రాల్లోని పాటలు మహేష్ అభిమానులను పూర్తి స్థాయిలో శాటిస్ఫై చేయలేకపోయాయి. ఆ రెండు సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు.. కానీ ఆ చిత్రాల్లోని పాటలు దేవి శ్రీ ప్రసాద్ స్థాయికి తగినట్టు లేవు.

ముఖ్యంగా మహేష్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఆ పాటలు లేవని ఆ టైములో వారు నిరుత్సాహపడ్డారు. తమన్ మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి.. ‘సర్కారు వారి పాట’ కి అతను మ్యూజిక్ డైరెక్టర్ అనగానే వారు ధీమాగా ఉన్నారు. మరి అతను ఎలాంటి పాటలు ఇస్తాడో చూడాలి. సరే ఇక అసలు విషయానికి వచ్చేస్తే మహేష్-త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ సినిమా తెరకెక్కనుంది. దానికి సంగీత దర్శకుడు ఎవరు అనే విషయం పై ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇవ్వలేదు.

మే 31న కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా ఇస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.ఒకవేళ అవి ఇవ్వకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనే విషయం పై అయినా క్లారిటీ ఇవ్వాలని వారు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మొదట్లో తమన్ లేదా మణిశర్మ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు దేవి శ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలకు దేవి మంచి మ్యూజిక్ ఇస్తాడు. అందులో ఎలాంటి డౌట్ లేదు. తొందరగా ఈ విషయం పై క్లారిటీ ఇస్తే అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus