మహేష్ వంశీ పైడిపల్లి మూవీపై కొద్దినెలలుగా వరుస కథనాలు వస్తున్నాయి. మహర్షి మూవీ విజయంతో సంతృప్తి చెందిన మహేష్ తన 27వ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశంవంశీకి ఇచ్చాడు. ఈ ప్రాజెక్ట్ పై దాదాపు ఏడాది వర్క్ చేసి వంశీ ఫైనల్ స్క్రిప్ట్ వినిపించగా మహేష్ సంతృప్తికరంగా లేదని రిజెక్ట్ చేశారని తెలిసింది. ఐతే మహేష్ ఈ ప్రాజెక్ట్ హోల్డ్ పెట్టడానికి అసలు కారణం రెమ్యూనరేషన్ అని, కాబట్టి ఇప్పట్లో వీరి కాంబినేషన్ లో మూవీ తెరకెక్కే సూచనలు లేవని గట్టిగా వినిపించాయి.
అలాగే మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ దర్శకుడు పరుశురామ్ తో కమిట్ కావడంతో పూర్తిగా వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ అటకెక్కినట్టే అనుకున్నారు. ఐతే మహేష్ తో తన మూవీ రద్దు కాలేదని వంశీ పైడిపల్లి తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన మహేష్ తో తన మూవీ రద్దు అయ్యింది అనే వార్తలలో నిజం లేదని అన్నారు. కొంచెం లేటవుతుంది కానీ సినిమా మాత్రం ఖచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. దీనితో ఇప్పటి వరకు వచ్చిన పుకార్లకు, కథనాలకు చెక్ పెట్టినట్లైంది.
అలాగే నెక్స్ట్ మహేష్ మూవీ పరుశురాం తో మొదలుకానుండగా, ఆ తరువాత వంశీ పైడిపల్లితో మహేష్ మూవీ ఉండే అవకాశం కలదు. రాజమౌళి మూవీ సెట్స్ పైకి వెళ్ళడానికి ఏడాదిన్నరకు పైగా సమయం ఉంది. ఈ గ్యాప్ లో మహేష్ పరుశురాం మరియు వంశీ పైడిపల్లి మూవీస్ పూర్తి చేయనున్నాడని తాజా వంశీ వ్యాఖల ద్వారా అర్థం అవుతుంది.