మహేష్ బాబు 25 వ చిత్రంగా వచ్చిన ‘మహర్షి’ మంచి కల్లెక్షన్లని సాధిస్తుంది. ఇదిలా ఉండగా తన 26 వ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్షన్లో చేయబోతున్న సంగతు తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పనుల్లోనే చాలా బిజీ గా గడుపుతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పక్క మాస్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి ‘సరిలేరు నీకెవ్వరూ’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్టుగా గత కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ టైటిల్ ఫిక్స్ కాకపోవచ్చనే టాక్ కూడా నడుస్తుంది.
మహేష్ కు ఈ టైటిల్ అంత నచ్చలేదంట.అందులోనూ మహేష్ 3 అక్షరాలా సెంటిమెంట్ కూడా ఉంది. ‘మురారి’ ‘ఒక్కడు’ ‘అతడు’ ‘పోకిరి’ ‘దూకుడు’ .. ఇప్పుడు ‘మహర్షి’ ఇలా దాదాపు మహేష్ హిట్లన్నీ మూడు అక్షరాల పేరుతోనే ఉన్నాయి. అలానే ‘అతిధి’ ‘ఆగడు’ వంటి డిజాస్టర్లు కూడా వున్నాయి. అయితే 90 శాతం మూడు అక్షరాల సినిమాలన్నీ హిట్లే కాబట్టి.. ఇది మహేష్ కు మినిమం గ్యారంటీ సెంటిమెంట్ గా మారిపోయింది. అందుకే మూడు అక్షరాలు ఉన్న టైటిల్ నే చూడామణి అనిల్ రావిపూడితో చెప్పాడట మహేష్. ప్రస్తుతం ఈ పని మీదే అనిల్ బిజీగా ఉన్నాడట.