కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ డైరెక్షన్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘స్పైడర్’ సినిమా రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈనెల ఐదవ తేదీ నుంచి స్పైడర్ లో మిగిలిఉన్న రెండు పాటల్లో ఒక పాట చిత్రీకరణ మొదలు పెట్టారు. మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ పై ఈ పాటను నిన్నటితో పూర్తిచేశారు. మిగిలిన ఒక్క పాటను లండన్లో ప్లాన్ చేశారు. వచ్చేనెల రెండవ తేదీ నుంచి యూరప్ లోని అందమైన లొకేషన్లో మహేష్, రకుల్ పై డ్యూయెట్ తెరకెక్కించనున్నారు. దీంతో స్పైడర్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయినట్లే.
ఇప్పటికే ఎడిటింగ్, డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీకి విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ రష్యా, చైనా తదితర దేశాల్లో జరుగుతోంది. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ట్రైలర్ మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
