స్పైడర్ కి ఇక డేట్స్ ఇవ్వనని మురుగదాస్ కి చెప్పిన మహేష్
- May 8, 2017 / 12:10 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు డైరక్టర్ మురుగదాస్ కి డెడ్ లైన్ విధించారు. వారిద్దరి కలయికలో స్పైడర్ మూవీ తెరకెక్కుతోంది. ఏకకాలంలో రెండు భాషల్లో ఈ మూవీ షూటింగ్ జరుపుకుంటుండడంతో మిగతావాటికంటే ఎక్కువ కాల్షీట్స్ కేటాయించారు. అయినా డైరక్టర్ కి అవి సరిపోలేదు. వాస్తవానికి ఏప్రిల్ కే షూటింగ్ అయిపోవాలి. కానీ క్లైమాక్స్ లో మార్పు వల్ల ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూల్ తో సినిమాని కంప్లీట్ చేయమని మహేష్ మురుగదాస్ కి చెప్పినట్లు తెలిసింది. ఇంకా డేట్లు అడిగితే ఇవ్వనని తేల్చి చెప్పినట్లు సమాచారం.
మురుగదాస్ కూడా ఈనెల 20 తేదీ లోపున టాకీ పార్ట్ పూర్తి చేయాలనీ ఫిక్స్ అయినట్లు చిత్ర బృందం తెలిపింది. మురుగదాస్ తర్వాత కొరటాల శివతో మహేష్ సినిమా చెయ్యాలి.. ఈ మూవీ మే నుంచి సెట్స్ పైకి వెళ్ళాలి. ఆలస్యం అవుతుండడంతో ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్ల డేట్స్ ఇబ్బందుల్లో పడ్డాయి. ఆ విషయాన్నీ దృష్టిలో పెట్టుకొని మహేష్ డైరక్టర్ కి ఈ డెడ్ లైన్ విధించారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















