ఇప్పట్లో ఎంత బడ్జెట్ పెట్టి సినిమా తీసినా.. దాని గురించి కరెక్ట్ గా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకోవాలి. ‘ప్రమోషన్స్ బాగా చేయడం అంటే ఎక్కువగా చేయడం’ అని అంతా అనుకుంటారు. మేకర్స్ కూడా అంతే..! కానీ ప్రమోషన్ బాగా చేయడం అంటే..సినిమా కంటెంట్ పై ప్రేక్షకులకి అవగాహన కల్పించేలా చేయడం. రాజమౌళి (S. S. Rajamouli) తన ప్రతి సినిమాకి చేసేది ఇదే. సినిమా షూటింగ్ మొదలుపెట్టే ముందే ‘అసలు తన సినిమా కథ ఏంటి?’ అనే విషయం పై క్లారిటీ ఇచ్చేస్తాడు.
The Rajasaab
సినిమాలో నటించే నటీనటుల వివరాలపై కూడా ఓ క్లారిటీ ఇచ్చేస్తాడు. దీంతో ప్రేక్షకులు మొదటి నుండి రాజమౌళి టేకింగ్ పైనే దృష్టి పెడతారు. అదే పద్ధతిని.. చాలా మంది ఫిలిం మేకర్స్ పాటిస్తూ వస్తున్నారు. కొంతమంది ఆ పద్ధతిని పాటించకుండా ప్లాపులు చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకి ఈ ఏడాది వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమానే తీసుకోండి. అది పక్కా మాస్ సినిమా అంటూ మేకర్స్ ప్రమోట్ చేసుకున్నారు.
కానీ సినిమాలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మొత్తం మిస్ లీడ్ చేసినట్టు అయ్యింది. రీసెంట్ గా వచ్చిన శ్రీవిష్ణు (Sree Vishnu) ‘శ్వాగ్’ (Swag) విషయంలో కూడా అదే జరిగింది. ఆ సినిమా టీజర్, ట్రైలర్స్ వేరుగా ఉంటాయి.. కానీ ట్రాన్స్ జెండర్స్ ట్రాక్ చుట్టూ కథ తిరుగుతుంది. దానిని దాచేసి సినిమాను ప్రమోట్ చేసుకున్నారు. అది వర్కౌట్ కాలేదు. అంతకు ముందు వచ్చిన శ్రీవిష్ణు సినిమా ‘ఓం భీం బుష్’ (Om Bheem Bush) ని ‘మా సినిమాలో లాజిక్ ఉండదు..
మేజిక్కే’ అంటూ ప్రమోట్ చేసుకున్నారు అది వర్కౌట్ అయ్యింది. ఇక ఇప్పుడు ‘ది రాజాసాబ్’ (The Rajasaab) మేకర్స్ కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతుంది. ఇది ఒక హారర్ రొమాంటిక్ డ్రామా అని .. గ్లింప్స్ ద్వారా ఓ క్లారిటీ ఇచ్చేశారు. కానీ ప్రభాస్ (Prabhas) వంటి స్టార్ ని అభిమానులు మెచ్చే విధంగా ప్రజెంట్ చేస్తున్నప్పుడు.. జోనర్ సైడ్ ట్రాక్ కి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుంది.
అందుకే ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే టీజర్లో కూడా.. ఈ హర్రర్ టచ్ ని హైలెట్ చేయబోతున్నారట. టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో ఓ కుర్చీ కనిపిస్తుంది. అలాగే పాడుబడ్డ బంగ్లా కూడా..! సో దీనిని బట్టి ‘ది రాజాసాబ్’ మేకర్స్ ఎంత అలర్ట్ గా ఉన్నారనేది చెప్పొచ్చు.