అనిల్ రావిపూడి వంటి దర్శకుడు ఇప్పుడు టాలీవుడ్ కి చాలా అవసరం అని దిల్ రాజు వంటి ఇండస్ట్రీ పెద్దలు చాలా మంది చెప్పుకొచ్చారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కూడా అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. అది ఎందుకు అనేది ఈరోజు జరిగిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana ShankaraVaraprasad Garu) సక్సెస్ మీట్ తో అందరికీ క్లారిటీ వచ్చింది.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “నేను ఏ సినిమా స్క్రిప్ట్ పై అయినా మ్యాగ్జిమమ్ 3 నెలల పాటు వర్క్ చేస్తాను. విత్ డైలాగ్ వెర్షన్ తో అంత టైం పడుతుంది. చాలా మందికి తెలిసే ఉంటుంది.. నా టీంతో వైజాగ్ వెళ్లి.. కొన్ని రోజులు అక్కడ స్పెండ్ చేసి స్క్రిప్ట్ రెడీ చేసుకుంటాను. అది నాకు అలవాటు. అయితే ఈ సినిమా(మన శంకర వరప్రసాద్ గారు) ఫస్ట్ హాఫ్ ని నేను 15 రోజుల్లో రెడీ చేశాను. సెకండాఫ్ ని 10 రోజుల్లో ఫినిష్ చేశాను. మొత్తంగా 25 రోజుల్లో స్క్రిప్ట్ మొత్తం అయిపోయింది.

నా కెరీర్లో ఫాస్టెస్ట్ స్క్రిప్ట్ ఇదే. ఎందుకు అంత ఫాస్ట్ గా అయిపోయింది అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు” అంటూ ఈరోజు జరిగిన సక్సెస్ మీట్లో చెప్పుకొచ్చాడు.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ” షూటింగ్ మొత్తం 75 రోజుల్లో ఫినిష్ చేసినట్టు చెప్పుకొచ్చాడు. యూనియన్ స్ట్రైక్ వల్ల 10 రోజులు అటు ఇటు అయ్యి ఉండొచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు. సో మొత్తంగా 100 రోజుల్లో ‘మన శంకర వరప్రసాద్ గారు పని అయిపోయినట్టే అనుకోవాలి.
