Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!
- June 27, 2025 / 12:05 PM ISTByPhani Kumar
మంచు విష్ణు (Manchu Vishnu ) ‘కన్నప్ప’ (Kannappa) రిలీజ్ హడావిడిలో ఉంటే.. మనోజ్ (Manchu Manoj) ఓ ట్వీట్ వేసి మళ్ళీ అతన్ని కెలికాడు. మంచు మనోజ్ తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ… ” ‘కన్నప్ప’ సినిమా యూనిట్ కి ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం కోసం మా నాన్నగారు మోహన్ బాబు (Mohan Babu) గారు, అలాగే టీమ్ ఎన్నో ఏళ్లు శ్రమించారు. ప్రేమతో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇది పెద్ద సక్సెస్ అందుకోవాలి.
Manchu Vishnu
మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్ రామ్..ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఆశపడుతున్నాను. మంచి వ్యక్తి ప్రభాస్ (Prabhas), లెజెండరీ నటులు మోహన్ లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar), ప్రభుదేవా ఇలా ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ స్పెషల్ థాంక్స్.

అలాగే తనికెళ్ల భరణి గారి జీవితకాలం కల జీవం పోసుకుని ఈ శుక్రవారం(జూన్ 27న) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం వాళ్ళు చేసిన సాయం, చూపించిన ప్రేమ చాలా గొప్పవి. ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ప్రేమ ఈ సినిమాకి తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ రాసుకొచ్చాడు.

అయితే మనోజ్ (Manchu Manoj) తన ట్వీట్లో ఎక్కడా కూడా మంచు విష్ణు గురించి స్పందించలేదు. దీంతో అతని ట్వీట్ చర్చనీయాంశం అయ్యింది. ఈరోజు జరిగిన ‘కన్నప్ప’ ఈవెంట్లో మంచు విష్ణు (Manchu Vishnu ) ని ఓ రిపోర్టర్ ఈ విషయంపై ప్రశ్నిస్తే.. ‘దయచేసి సినిమా గురించి మాత్రమే అడగండి’ అంటూ దాటేశాడు. ఆ ట్వీట్ పై స్పందించడానికి మంచు విష్ణు ఇష్టపడలేదు.
















