సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు మారుతి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మంచిరోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే ప్లాప్ టాక్ వచ్చింది. టీజర్, ట్రైలర్, పాటలకి ప్రేక్షకుల నుండీ మంచి స్పందన లభించింది కానీ సినిమా మెప్పించలేకపోయింది. దాంతో ఓపెనింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
0.79 cr
సీడెడ్
0.35 cr
ఉత్తరాంధ్ర
0.22 cr
ఈస్ట్
0.17 cr
వెస్ట్
0.11 cr
గుంటూరు
0.16 cr
కృష్ణా
0.14 cr
నెల్లూరు
0.10 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.04 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.09 Cr
ఓవర్సీస్
0.15 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
2.28 cr
‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రానికి రూ.8.9 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. అయితే ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.2.28 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 6.72 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. చూస్తుంటే అది కష్టమనిపిస్తుంది.