Manchu Manoj: ప్రీమియర్ కు సిద్దమవుతున్న మనోజ్ టాక్ షో!

మంచు మనోజ్ గత కొంత కాలం నుంచి సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఈయన హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు పొందారు. అయితే తన వ్యక్తిగత విషయాల ద్వారా సినిమాలకు దూరమయ్యారు. ఇకపోతే ఈయన తాజాగా రెండో వివాహం చేసుకున్న తరువాత కెరియర్ పై ఫోకస్ పెట్టడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సంతోషంగా ఉన్నారు. ఇక ప్రస్తుతం పలు సినిమాలకు మంచు మనోజ్ కమిట్ అయ్యారు. ఇలా ఒకవైపు సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా మరోవైపు బుల్లితెర కార్యక్రమాలకు కూడా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా ఈయన చేయబోయే టాక్ షో ఓటీటీ ప్లాట్‌ఫాం ETV Winలో రాబోతుంది. ఈ టాక్‌ షోను అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెరకెక్కిస్తోంది. ఇప్పటికే ఈ షో కి సంబంధించి ప్రోమో విడుదల కాగా ఈ ప్రోమోకీ మంచి రెస్పాన్స్ వచ్చింది. రెండు నిమిషాల నిడివి ఉన్న ఈ ప్రోమోలో మంచు మనోజ్ తన గురించి తాను చెప్పుకున్నారు. రాకింగ్ స్టార్ మళ్లీ రాబోతున్నాడని చెప్పారు. మనోజ్ వాయిస్‌తో కూడిన ఈ ప్రోమో అందరినీ ఆకర్షిస్తోంది.

ఇక టాక్ షోకి ఉస్తాద్..రాంప్ ఆడిద్దాం.ఇక ఈ ప్రోమోలో…నా ప్రపంచం సినిమా. నేను చిన్నప్పటి నుంచీ సినిమా పై పెంచుకున్న ప్రేమ నావృత్తిగా మారింది. నన్ను ఒక నటుడిగానూ చేసి రాకింగ్‌ స్టార్‌ అని ఒక పేరు కూడా ఇచ్చింది. ఫ్యాన్స్‌, విజిల్స్‌, అరుపులు, కేకలు.. ఇలా ఒక పండగలా జరిగిన నా జీవితంలోకి ఒక నిశ్శబ్దం ఏర్పడింది. దీంతో అందరూ మనోజ్‌ అయిపోయాడు అన్నారు. నా సినీ కెరీర్ ఖతం అన్నారు.

మనోజ్ (Manchu Manoj) ఇక నటన ఆపేశాడు.. ఇంక తిరిగి రాడు అన్నారు. ఎనర్జీ స్టార్‌లో ఎనర్జీ తగ్గిందీ అన్నారు. విన్నాను.. చూశాను.. మౌనంగా భరించాను.. తిరిగొస్తున్నాను అంటూ మనోజ్ చెప్పే మాటలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ప్రోమోతో ఒక్కసారిగా మళ్లీ ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకున్నాయి. మరి ఈ షో ద్వారా మనోజ్ ఎలాంటి సక్సెస్ అందుకుంటారు తెలియాల్సి ఉంది. ఇక ఈయన మరో వైపు వినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus