Manchu Vishnu: కీలక నిర్ణయం తీసుకున్న ‘మా’ అధ్యక్షుడు విష్ణు!

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు జరిగి… కొద్ది నెలల అవుతుంది. ఎన్నికలు జరిగినప్పుడు ఉన్న సందడి కంటే, ఆ తర్వాత జరిగినవి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా అనిపించాయి. ప్రకాశ్‌ ప్యానల్‌ నుండి గెలిచిన 11 మంది తమ పదవులకు రాజీనామా చేస్తున్న పెద్ద ప్రెస్‌ మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే వారి రాజీనామాలు ఆమోదించేది లేదని విష్ణు చెప్పేశారు కూడా. కానీ ఇప్పుడు విష్ణు ఆ రాజీనామాల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆ 11 రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించారు. దీంతో ‘మా’ ఎన్నికల అంశం మరోసారి చర్చకు వచ్చింది. రాజీనామాలు ఆమోదించం, అందరం కలసి పని చేస్తాం అని చెప్పిన విష్ణు చెప్పారు. రాజీనామాలు వెనక్కి తీసుకోవల్సిందిగా విష్ణు ఆ 11 మందిని కోరారట. కానీ వారు అందుకు ఓకే చెప్పలేదట. దీంతో నెల రోజులు చూసి… ఇప్పుడు రాజీనామాల్ని ఆమోదించాం అని విష్ణు చెప్పారు. అంతేకాదు వారి స్థానంలో స్థానంలో కొత్త సభ్యుల్ని తీసుకున్నాం అని కూడా చెప్పారు.

‘మా’ పనుల కోసమే కొత్త సభ్యుల్ని తీసుకున్నామని విష్ణు వెల్లడించారు. అయితే వారు పదవులకి రాజీనామా చేసినా, ‘మా’ సభ్యులుగా మాత్రం కొనసాగుతారని తెలిపారు. అలాగే నాగబాబు, ప్రకాష్‌రాజ్‌ కూడా ‘మా’ సభ్యులుగా ఉంటారని విష్ణు చెప్పారు. కొత్తగా సభ్యులు అంటే… ఇటీవల జరిగిన ఎన్నికల్లో విష్ణు ప్యానల్‌ నుండి ఓడిపోయినా వారే ఆ సభ్యులు. ఎవరు పోటీ చేసిన పదవికి వారినే తీసుకున్నట్లు తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus