వైరలవుతున్న మెలోడీ బ్రహ్మ మనిశర్మ కుమారుడి నిశ్చితార్ధం ఫోటోస్!

మెలోడీ బ్రహ్మ మణిశర్మ కుమారుడు సాగర్ మహతి కూడా సంగీత దర్శకుడిగా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలకాలంలో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన “ఛలో, భీష్మ, మ్యాస్ట్రో” చిత్రాలకు సంగీతం అందించిన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అలాగే తన తండ్రి పని చేసే చిత్రాలకు సౌండ్ ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఆయనకీ చేదోడు వాదోడుగాను ఉంటున్నాడు. ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో అందరి హీరోలతో పనిచేసిన మణిశర్మ తనయుడైన సాగర్ మహతి నిశ్చితార్ధం మొన్న (అక్టోబర్ 9) సాయంత్రం కుటుంబ సభ్యుల సమక్షంలో ఎటువంటి ఆర్భాటాలకు తావు లేకుండా అత్యంత సాధారణంగా జరిగింది. సాగర్ మహతి తన సోషల్ మీడియా ఎకౌంట్స్ లో పోస్ట్ చేసేవరకు.. ఈ విషయం ఎవరికీ తెలియదు.

స్వరసాగర్ మహతి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కూడా సింగర్ కావడం విశేషం. పలు తమిళ, కన్నడ చిత్రాలతోపాటు.. సాగర్ మహతి సంగీత సారధ్యంలో రూపొందిన “భీష్మ” చిత్రంలోని “హేయ్ చూసా” అనే పాటను కూడా సంజన పాడడం విశేషం. నిజానికి వీరిద్దరూ ఎప్పటినుంచో స్నేహితులు. స్నేహితులు కాస్తా ఇప్పుడు నిశ్చితార్థంతో భార్యాభర్తలుగా మారనున్నారు. ప్రస్తుతం వీరి ఎంగేజ్ మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఈ సందర్భంగా ఫిల్మీఫోకస్ నూతన వధూవరులకు బెస్ట్ విషెస్ అందిస్తోంది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Share.