Soubin Shahir Arrested: బ్లాక్ బస్టర్ సినిమా నిర్మాత అరెస్ట్.. ఏమైందంటే..!

గతేడాది మలయాళ సినీ పరిశ్రమకి బాగా కలిసొచ్చింది.ఆ ఏడాది మలయాళంలో ఏకంగా 2,3 ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్స్ పడ్డాయి. అందులో ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ ఒకటి. ఈ సినిమా నిర్మాత సౌబిన్ షాహిర్ ఇప్పుడు అరెస్ట్ అవ్వడం సంచలనంగా మారింది. చీటింగ్, ఫోర్జరీ కేసుల్లో ఇతన్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. ‘మంజుమ్మల్ బాయ్స్’ కి సౌబిన్ షాహిర్ నిర్మాత మాత్రమే కాదు నటుడు కూడా.షాహిర్ తో పాటు షాన్ ఆంటోనీ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించారు.

Soubin Shahir Arrested

రూ. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ‘మంజుమ్మ‌ల్ బాయ్స్’ బాక్సాఫీస్ వద్ద రూ. 250 కోట్లకి పైగా వసూళ్ళు సాధించింది. తెలుగులో కూడా రూ.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి సూపర్ హిట్ అనిపించుకుంది. అయితే.. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ విషయంలో నిర్మాత‌లు సౌబిన్ షాహిర్ అత‌ని తండ్రి బాబు షాహిర్, షాన్ ఆంటోనీలపై సిరాజ్ వలియతర హమీద్ సంచలన ఆరోపణలు చేశాడు.

తన వద్ద రూ.7 కోట్లు పెట్టుబ‌డిగా తీసుకుని, 40 % వాటా ఇస్తామని హామీ ఇచ్చి.. ఫైనల్ గా రూ.47 కోట్ల వరకు ఎగ్గొట్టారని సిరాజ్ వలియతర హమీద్ కోర్టుకెక్కాడు. దీంతో నిర్మాత‌ల‌పై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదైంది. ఏడాది కాలంగా దీనిపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కి అలాగే ఎఫ్ఐఆర్‌ను కొట్టివేయాల్సిందిగా నిర్మాతలు కూడా కేర‌ళ కోర్టులో రిక్వెస్ట్ పెట్టుకున్నారు.

కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. కానీ ఎఫ్.ఐ.ఆర్ ను రద్దు చేయలేదు. దీంతో తాజాగా మారాడు స్టేష‌న్ పోలీసులు సోమవారం నిర్మాతలను విచార‌ణ‌కు పిలిచి అరెస్ట్ చేశారు. సోమవారం నాడు వారిని అరెస్ట్ చేసి మంగళవారం నాడు బెయిల్‌పై అరెస్ట్ చేసినట్టు సమాచారం.

డాక్యుమెంటరీ ఎఫెక్ట్‌: నయన్‌ ₹5 కోట్లు కట్టాల్సిందేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus