ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు బాగా క్యాష్ చేసుకుంటాయి. అది ఎంత నిజమో.. ఫిబ్రవరి అనేది అన్ సీజన్ మొదలవుతుంది అనేది కూడా అంతే నిజం. ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యే సినిమాలు ఆడవు అని ఇండస్ట్రీ భావిస్తూ ఉంటుంది. అందుకే మార్చి నెలలో తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలి అని మేకర్స్ భావిస్తుంటారు. అయితే గత రెండు, మూడు ఏళ్లుగా చూసుకుంటే.. అసలైన అన్ సీజన్ మార్చి అని కొందరు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే మార్చి సీజన్లో రిలీజ్ అయ్యే సినిమాలు ఆడట్లేదు. అందుకు గల కారణాలు కూడా లేకపోలేదు. మార్చి నెల అనేది పరీక్షల సీజన్. టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షలు ఈ టైంలో నిర్వహిస్తూ ఉంటారు. సినిమాలు ఎక్కువగా చూసేది స్టూడెంట్స్ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మరి వాళ్ళు పరీక్షల టెన్షన్లో ఉన్నప్పుడు థియేటర్లకు ఎలా వస్తారు. అందుకోసం గత రెండు, మూడు ఏళ్లుగా మార్చి నెలని ఖాళీగా వదిలేస్తున్నారు మేకర్స్.
మార్చిలో సినిమాలు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటనలు కూడా ఇవ్వడం లేదు. ఒకవేళ అనౌన్స్ చేసినా మార్చి నెలాఖరుకి చేస్తున్నారు. ఎందుకంటే.. ఆ టైంకి కనీసం ఇంటర్మీడియట్ పరీక్షలు కంప్లీట్ అవుతాయి. అందుకే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాని మార్చి 28న అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్చి సీజన్ ని ఎక్కువగా.. రీ రిలీజ్..ల కోసం కేటాయించినట్టు స్పష్టమవుతుంది. ఇది పూర్తిగా డిస్ట్రిబ్యూటర్స్ నిర్ణయం అని తెలుస్తుంది.
మార్చి నెలలో సినిమాలు రిలీజ్ చేయొద్దు అని ఆంధ్ర డిస్ట్రిబ్యూటర్లు ఫిలిం మేకర్స్ కి రిక్వెస్ట్..లు చేస్తున్నారు. దీంతో ఈ మార్చి నెలకి ఎక్కువగా రీ- రిలీజ్ సినిమాలు రాబోతున్నాయి అని స్పష్టమవుతుంది. ఆల్రెడీ మార్చి 1న ‘గోదావరి’ (Godavari) సినిమాని రీ- రిలీజ్ చేస్తున్నారు. అటు తర్వాత మహేష్ బాబు (Mahesh Babu) – వెంకటేష్ (Venkatesh Daggubati)..ల క్రేజీ మల్టీస్టారర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ని (Seethamma Vakitlo Sirimalle Chettu) రీ రిలీజ్ చేస్తున్నారు. మరికొన్ని సినిమాలు కూడా ఈ నెలలో రీ – రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.