‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘భాగమతి'(Bhaagamathie) ‘ఖిలాడి’ (Khiladi) ‘యశోద’ (Yashoda) వంటి సినిమాలతో తెలుగులో కూడా పాపులర్ అయ్యాడు ఉన్ని ముకుందన్ (Unni Mukundan) . ఇతను హీరోగా మలయాళంలో ‘మార్కో’ (Marco)అనే సినిమా రూపొందింది. హనీఫ్ అదేని (Haneef Adeni) ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళంలో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ అయ్యింది. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఏకంగా రూ.107 కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో తెలుగులో కూడా ఈ చిత్రాన్ని డబ్ చేసి రిలీజ్ చేశారు.
అయితే ఈ సినిమా చూసి తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఎందుకంటే ఇందులో లెక్కలేనంత వయొలెన్స్ ఉంటుంది. అసలు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకి ఎలా అనుమతి ఇచ్చిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. జనవరి 1న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. టాక్ ఎలా ఉన్నా.. తెలుగులో కూడా ఈ సినిమా బాగానే కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.70 cr |
సీడెడ్ | 0.18 cr |
ఆంధ్ర(టోటల్) | 0.46 cr |
తెలంగాణ + ఆంధ్ర (టోటల్) | 1.34 cr |
‘మార్కో’ చిత్రం రూ.1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.1.34 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.0.16 కోట్ల(షేర్) స్వల్ప నష్టాలతో ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.2.5 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.