Prabhas, Maruthi: ప్రభాస్-మారుతి కాంబో.. నిజమెంత..?

దర్శకుడితో చిన్న సినిమాలతో కెరీర్ మొదలుపెట్టిన మారుతి పెద్ద స్థాయికి ఎదిగారు. తనకు ఇప్పుడు స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే హోదా వచ్చింది. కానీ ఈ విషయంలో మారుతి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ హీరోగా మారుతి ఓ సినిమా చేయబోతున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. వీరిద్దరి మధ్య మంచి ర్యాపో ఉండడంతో ఈ కాంబినేషన్ పట్టాలెక్కుతుందని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఈలోగా మారుతికి మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.

ఇప్పుడు ప్రభాస్ తోనూ మారుతి సినిమా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దానికొక కారణముంది. యూవీ అంటే మారుతికి సొంత సంస్థ లాంటిది. ప్రభాస్ కి కూడా అంతే. మారుతికి ప్రభాస్ కి మధ్య మంచి రిలేషన్ ఉంది. అందుకే వీరిద్దరిలో కాంబినేషన్ లో సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది. వీటిపై మారుతి స్పందించారు. ”ఈ మ‌ధ్య ప్ర‌భాస్ తో సినిమా చేస్తున్నాన‌ని వార్తలొస్తున్నాయి. వాటిలో నిజం లేదు. నేనెప్పుడూ..

హీరోల్ని దృష్టిలో ఉంచుకుని క‌థ‌లు రాసుకోను. నా క‌థ‌కు ఎవ‌రైతే బాగుంటారో, వాళ్ల ద‌గ్గ‌ర‌కు వెళ్తా. ప్ర‌భాస్ తో సినిమా చేయాల‌ని ప్ర‌తి ఒక్క‌రికి ఉంటుంది. నాకు కూడా ఉంది. మంచి క‌థ దొరికితే క‌చ్చితంగా ప్ర‌భాస్ దగ్గరకు వెళ్తా. అయితే ఇప్పుడొస్తున్న వార్త‌ల్లో నిజం లేదు” అంటూ క్లారిటీ ఇచ్చారు.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus