Mathu Vadalara 2 Teaser Review: మళ్ళీ బాలయ్య వైరల్ డైలాగ్ వాడేశారుగా..!
- August 30, 2024 / 12:08 PM ISTByFilmy Focus
2019 చివర్లో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ కూడా రాబోతుంది. సెప్టెంబర్ 13న రిలీజ్ కాబోతున్న ‘మత్తు వదలరా 2’ కి సంబంధించిన టీజర్.. కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు మేకర్స్. ‘మత్తు వదలరా 2’ టీజర్ 1 :39 నిమిషాలు ఉంది.
Mathu Vadalara 2 Teaser Review

‘ఫస్ట్ పార్ట్ కి అంచనాలు లేవు.. సెకండ్ పార్ట్ కి అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వారి అంచనాల గురించి మీ అంచనా ఏంటి?’ అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. పార్ట్ పై అంచనాలు ఉన్నాయి అనే విషయాన్ని సెటైరికల్ గా దర్శకుడు ఒక్క డైలాగ్ తో క్లారిటీ ఇచ్చేశాడు. డ్రగ్స్ బ్యాచ్ ని పట్టించినందుకు అనుకుంట హీరో సింహా (Sri Simha Koduri ), అతని ఫ్రెండ్ సత్య (Satya) పాత్రలకి ‘హీ'(HE) టీంలో ఉద్యోగాలు వచ్చినట్టు చూపించారు.

ఆ తర్వాత వీళ్ళకి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? హీరోయిన్ నిథి పాత్ర ఏంటి? మళ్ళీ డ్రగ్స్ బ్యాచ్ ను పట్టుకోవడానికి హీరో అండ్ గ్యాంగ్ చేసే అల్లరి ఏంటి? అనేది ప్రధానంగా ఈ టీజర్లో చూపించారు.దర్శకుడు రితేష్ రానా మార్క్ వెటకారం కూడా ఇందులో మిస్ కాలేదు. టీజర్ ఆరంభంలోనే సందీప్ రెడ్డి వంగా డైలాగ్ వాడాడు,

చివర్లో ‘నవ్వకండి..ఇట్స్ ఏ సీరియస్ ఇష్యు’ అంటూ బాలయ్య ట్రోలింగ్ డైలాగ్, ఓవర్ యాక్షన్ చేయడానికి ఇది యాక్షన్ సినిమా కాదు అంటూ తెలుగు సినిమాల పై పంచ్ వేస్తూ ఇంకో డైలాగ్, అలాగే సీరియల్ ఎపిసోడ్ .. ఇలా ఏదీ మిస్ చేయలేదు. టీజర్ చూస్తుంటే.. మళ్ళీ థియేటర్లలో ‘మత్తు వదలరా 2’ నవ్వులు పంచడం ఖాయంగా కనిపిస్తుంది. మీరు కూడా టీజర్ ను ఓ లుక్కేయండి :
పారితోషికం విషయంలో ప్రపంచ రికార్డు కొట్టిన స్టార్ హీరో..!












