ఈ 2020 లో అన్ని పరిశ్రమలకు ఓ వైరస్ మహమ్మారి వల్ల పెద్ద దెబ్బె పడింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమకు అయితే కొన్ని వందల కోట్ల నష్టం వాటిల్లింది. పెద్ద హీరో చిన్న హీరో.. అనే బేదం లేకుండా అందరి సినిమాల షూటింగ్ లు ఆగిపోయాయి.థియేటర్స్ మూత పడటం వల్ల కొన్ని సినిమాల రిలీజ్ కూడా ఆగిపోయింది. 3 నెలల పాటు షూటింగ్ లు నిలిచిపోవడంతో అన్ని సినిమాల షెడ్యూల్స్ మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు షూటింగ్ లకు పెర్మిషన్లు దొరికాయి.
జూలై 15 నుండీ షూటింగ్ లు మొదలపెట్టడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ఆగష్ట్ నుండీ థియేటర్స్ ఓపెన్ చెయ్యడానికి కూడా సన్నాహాలు చేస్తున్నారు. అయితే థియేటర్లకు జనాలు రావడానికి మరో 3 నెలల టైం పడుతుంది. కాబట్టి దసరా, దీపావళి సీజన్ లకు పెద్ద సినిమాలు విడుదల చేస్తే బాగుణ్ణు అని అంతా కోరుకుంటున్నారు. అయితే ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చరణ్, అల్లు అర్జున్ ల సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం లేదు.
కాబట్టి ఇద్దరు మెగా బ్రదర్స్ పైనే ఆశలు పెట్టుకున్నారు సినీ ప్రియులు. వారిలో ఒకరు మెగాస్టార్ చిరంజీవి అయితే మరొకరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ ‘వకీల్ సాబ్’ 70శాతం పూర్తయ్యింది. ఇక చిరు -కొరటాల ‘ఆచార్య’ చిత్రం కూడా 40శాతం పూర్తయ్యింది.బౌండ్ స్క్రిప్ట్ ఉంది..కాబట్టి ‘ఆచార్య’ షూటింగ్ 3 నెలల్లో షూటింగ్ ఫినిష్ చేసే ఛాన్స్ ఉందట. కాబట్టి దసరా కి పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. అలాగే దీపావళికి మెగాస్టార్ ‘ఆచార్య’ సినిమా రిలీజ్ అయితే బాగుణ్ణు అని ప్రేక్షకులు చాలా ఆశలు పెట్టుకుంటున్నారు. మరి వారి ఆశలు ఫలిస్తాయో లేదో చూడాలి.