Chiranjeevi: బ్రహ్మానందం ఇంటికెళ్లి మరీ బర్త్ డే విషెస్ చెప్పిన చిరు.. వైరల్ అవుతున్న ఫోటోలు

ఈ రోజు గాడ్ ఆఫ్ కామెడీ, హాస్య బ్రహ్మ గా పిలవబడే బ్రహ్మానందం పుట్టిన రోజు. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు నవ్వడం మొదలుపెడతారు. ఎందుకంటే కమెడియన్ గా ఆయనకు దక్కిన స్టార్ ఇమేజ్ అదని చెప్పాలి. గతంలో ప్లాపుల్లో ఉన్న స్టార్ హీరోలు కూడా బ్రహ్మానందం కామెడీ వల్ల గట్టెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ‘జల్సా’, మహేష్ బాబు ‘దూకుడు’ ఎన్టీఆర్ ‘అదుర్స్’ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.

అయితే బ్రహ్మానందం ప్రస్తుతం ఎక్కువ సినిమాల్లో నటించడం లేదు. చేసే ఒకటి రెండు సినిమాలు అయినా కూర్చుని నటించే పాత్రలే చేస్తున్నారాయన.’జాతి రత్నాలు’ ‘వీరసింహారెడ్డి’ వంటి చిత్రాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే సోషల్ మీడియాలో మాత్రం హవా మొత్తం బ్రహ్మిదే.70 శాతం మీమ్స్ లో ఆయనే కనిపిస్తారు. సినిమాలు తగ్గించినా బ్రహ్మీ ఈ విధంగా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇది పక్కన పెడితే..బ్రహ్మానందంతో చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే.

ఈరోజు బ్రహ్మానందం పుట్టినరోజు కావడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి మరీ బర్త్ డే విషెస్ చెప్పారు. చిరంజీవి ఈ మధ్య కాలంలో టాలీవుడ్ కు చెందిన లెజెండ్స్ కు ప్రత్యేకంగా వెళ్లి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మొన్న అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సారి బ్రహ్మి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేకంగా వెళ్లి బ్రహ్మానందంకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి వచ్చారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus