Smita, Chiranjeevi: స్మిత టాక్ షోలో చిరు సంచలన వ్యాఖ్యలు..!
- February 3, 2023 / 09:50 AM ISTByFilmy Focus
థియేటర్ల కంటే టీవీల కంటే జనాలు ఓటీటీలకు దగ్గరవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే.. ఓటీటీల్లో బోల్డ్ కంటెంట్ ఉంటుంది. బోల్డ్ కంటెంట్ కు అడల్ట్ కంటెంట్ కు చాలా వ్యత్యాసం ఉంటుంది. బోల్డ్ కంటెంట్ అంటే నిజమైన, బలమైన కంటెంట్ అన్న మాట. అందుకే ప్రేక్షకులు ఓటీటీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా టాక్ షోలు టీవీల్లో టెలికాస్ట్ అవుతున్నాయి అంటే.. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి.
అదే ఓటీటీలకు అయితే అలాంటిదేమీ ఉండదు. ఇందులో చాలా వరకు సెన్సిటివ్ టాపిక్ ల పై చర్చిస్తూ ఉంటారు. అందుకే వీటికి జనాలు కూడా ఆకర్షితులవుతున్నారు. బాలయ్య ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సక్సెస్ అయ్యింది కూడా ఇందుకే..! సరే ఇక అసలు మేటర్ కి వచ్చేద్దాం. ‘నిజం విత్ స్మిత’ పేరిట వస్తోన్న ఓ టాక్ షో ప్రారంభం కానుంది. స్మిత హోస్ట్ చేస్తున్న ఈ షో సోనీ లివ్‌లో ఫిబ్రవరి 10 నుండి స్ట్రీమింగ్ కానుంది.

ఆల్రెడీ అన్ని ఎపిసోడ్ లకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయినట్టు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోని బట్టి స్పష్టమవుతుంది. మెగాస్టార్ చిరంజీవి, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాధికా శరత్ కుమార్, నాని, రానా దగ్గుబాటి, సాయి పల్లవి, నిర్మాత స్వప్న దత్, దేవకట్ట, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి,హీరో అల్లరి నరేష్ వంటి స్టార్స్ ఈ షోలో పాల్గొన్నారు.చిరంజీవికి సంబంధించిన ఎపిసోడ్ లో ఆయన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న ఛాలెంజెస్ గురించి వివరించారు.

ఆయన్ని మొదట్లో ‘సినిమాల్లో నటిస్తావా.. ఏ కులం మీది’ అంటూ హేళన చేసినట్టు చిరు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
It’s been a journey & finally,here we are today sharing with you a passion project I’ve been working on.Let the truth prevail. #NijamWithSmita only on @SonyLIV@KChiruTweets @ncbn @NameisNani @RanaDaggubati @Sai_Pallavi92 @realradikaa @AdiviSesh @devakatta pic.twitter.com/1QSRgt3dCU
— Smita (@smitapop) February 2, 2023
2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!
షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?
















