మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న భారీ పీరియాడిక్ ఫాంటసీ విశ్వంభర (Vishwambhara) చుట్టూ ఇప్పటివరకు పలు చర్చలు నడిచాయి. మొదటిసారి టీజర్ విడుదలైనప్పుడు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే గ్రాఫిక్స్ పనితీరుపై వచ్చిన ట్రోలింగ్, సినిమాకు సంబంధించి కలెక్షన్ల మార్కెట్‌పై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో మేకర్స్ సమయం తీసుకుని విజువల్ ఎఫెక్ట్స్‌ను మెరుగుపరిచే పనిలో పడ్డారు. లేటెస్ట్ సమాచారం ప్రకారం, చిత్రబృందం చిరంజీవి పుట్టినరోజైన ఆగస్టు 22న ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్.
సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా అనేక కారణాల వల్ల వాయిదా పడింది. టీజర్ చూసిన ప్రేక్షకుల ఫీడ్‌బ్యాక్ ప్రకారం, గ్రాఫిక్స్ పనిని మరింత ఇంప్రూవ్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. చిరంజీవి కూడా ఈ విషయాన్ని గమనించి, వెహికల్స్ వర్క్ చేసిన హాలీవుడ్ టెక్నీషియన్లను రంగంలోకి దింపారు. దీంతో సినిమా విజువల్స్ మరింత గ్రాండ్‌గా కనబడతాయని టీమ్ నమ్ముతోంది.
అయితే, ఈ వాయిదా వల్ల సినిమా బడ్జెట్ మరింత పెరిగినప్పటికీ, క్వాలిటీ విషయంలో మాత్రం రాజీ పడకుండా భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే, టీజర్ విడుదల అనంతరం సినిమా ఓటీటీ, శాటిలైట్ రైట్స్ సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. సాధారణంగా మెగాస్టార్ సినిమాలకు ముందుగానే డీల్ పూర్తవుతుంది. కానీ విశ్వంభర విషయంలో ఈ విషయం ఆలస్యమవ్వడం అందరిలోనూ హాట్ టాపిక్ గా మారింది.
థియేట్రికల్ మార్కెట్‌పై ఎక్కువగా ఆధారపడాల్సిన ఈ సినిమా, విడుదల సమయంలో ఏ స్థాయిలో క్రేజ్ క్రియేట్ చేస్తుందనేది కీలకం. లేటెస్ట్ సమాచారం మేరకు, ఆగస్టు 22న మెగాస్టార్ పుట్టినరోజున విశ్వంభరని గ్రాండ్‌గా విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. అధికారిక అనౌన్స్‌మెంట్ రాలేదు గానీ, వర్క్ ప్రోగ్రెస్ బట్టి చూస్తే ఇది లాంచ్ అయ్యే డేట్ ఖాయమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. చిరు ఫ్యాన్స్ కూడా ఇదే ఆశిస్తున్నారు. మరి, మేకర్స్ రాబోయే అప్డేట్స్ తో ఆడియెన్స్ అంచనాలను అందుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.