Michael Collections: యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకున్న మైఖేల్!

  • February 27, 2023 / 04:03 PM IST

సందీప్ కిషన్ హీరోగా రూపొందిన తొలి పాన్ ఇండియా చిత్రం ’మైఖేల్’. రంజిత్ జయకోడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘కరణ్ సి ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పి’ ‘శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి’ బ్యానర్లపై భరత్ చౌదరి, పుస్కూర్ రామ్ మోహన్ రావు లు సంయుక్తంగా నిర్మించారు.దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, గౌతమ్ మీనన్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

మైఖేల్ టీజర్, ట్రైలర్లకు కూడా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.దీంతో ఫిబ్రవరి 3న రిలీజ్ అయిన ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ మొదటి రోజు మిక్స్డ్ టాక్ రావడంతో సో సో ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అయితే రెండో రోజు, మూడో రోజు పెద్దగా డ్రాప్స్ లేకుండా మొదటి రోజు తరహాలోనే కలెక్ట్ చేసింది.కానీ వీక్ డేస్ లో ఈ చేతులెత్తేసింది. చాలా చోట్ల డెఫిసిట్స్ పడ్డాయి. ఫైనల్ గా ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 0.95 cr
సీడెడ్ 0.36 cr
ఉత్తరాంధ్ర 0.41 cr
ఈస్ట్ 0.23 cr
వెస్ట్ 0.19 cr
గుంటూరు 0.28 cr
కృష్ణా 0.26 cr
నెల్లూరు 0.14 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 2.82 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.15 cr
ఓవర్సీస్ 0.09 cr
మిగిలిన భాషలు 0.17 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.23 cr (షేర్)

‘మైఖేల్’ చిత్రానికి రూ.3.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.3.4 కోట్లు(తెలుగు వెర్షన్) షేర్ ను రాబట్టాలి. వీకెండ్ వరకు బాగానే కలెక్ట్ చేసిన ఈ మూవీ సోమవారం నుండీ బాగా డౌన్ అయ్యింది.

ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.3.23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.. ! ఇది కూడా జి.ఎస్. టి అలాగే నెగిటివ్ షేర్స్ వంటివి కాకుండా.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus