రోజూ తాగొచ్చి కొట్టేవాడు.. నటుడిపై భార్య కామెంట్స్!

‘మొగలిరేకులు’ సీరియల్ లో దయ అనే క్యారెక్టర్ లో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న పవిత్రనాథ్ చీకటి వ్యవహారాన్ని అతని భార్య బయటపెట్టింది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. పవిత్రనాథ్ తో 2009లో తనకు పెళ్లయిందని.. అప్పటినుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి అని చెప్పింది. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికి తీసుకొచ్చేవాడని..ప్రశ్నించినందుకు చేయి చేసుకున్నాడని చెప్పుకొచ్చింది.

ఓ అమ్మాయితో ఎనిమిదేళ్లు ఎఫైర్ నడిపించి తనని కూడా మోసం చేశాడని తెలిపింది. ప్రతిరోజూ తాగి ఇంటికొచ్చి టార్చర్ పెడతాడని.. తను ఏ సీరియల్స్ లో నటిస్తున్నాడో ఒక్కరోజు కూడా చెప్పలేదని.. పదేళ్లుగా నరకం అనుభవిస్తున్నానని తన ఆవేదన వెళ్లగక్కింది. విడాకులు కూడా ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడంటూ ఎమోషనల్ అయింది. ఈ విషయం గురించి తన అత్తమామలకు చెబితే.. తననే ఇంట్లో నుంచి గెంటేశారని తెలిపింది.

తనకు జరిగిన అన్యాయం మరెవరికీ జరగకూడదని.. తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పవిత్రనాథ్ ‘కృష్ణ తులసి’ అనే సీరియల్ లో నటిస్తున్నాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Share.