‘జారుమి ఠాయి’ పాట పాడినందుకు మోహన్ బాబు ఎంత ఇచ్చారంటే..?

‘జారు మిఠాయి’ సాంగ్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.. ఇక రీల్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు.. లిరిక్స్, వాయిస్ బాగున్నాయని కొందరు అనుకుంటే.. సన్నీ లియోన్ సాంగ్ అని మరి కొందరికి నచ్చింది.. బందరు మిఠాయి, నారింజ మిఠాయి తెలుసు కానీ ఈ జారు మిఠాయి ఏంటబ్బా?.. ఓహో.. ఇందులో కూడా మిఠాయి ఉంది కాబట్టి ఇదో రకమైన మిఠాయి అయ్యింటదిలే అనుకున్న వాళ్లూ లేకపోలేదు.. మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో .. మోహన్ బాబు ‘ఆవిడ మా ఊరు నుండి వచ్చారు..

పాట పాడతారు’ అని చెప్పేవరకు.. ఇలాంటి పాట ఒకటుందని తెలియదు.. ‘జిన్నా’ సినిమా థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది కానీ ఈ సాంగ్ మాత్రం జనాల మైండ్‌లో నుండి పోవట్లేదు.. ఈరోజుల్లో సోషల్ మీడియా పుణ్యమా అని ఎవరు, ఎప్పుడు, ఎలా పాపులర్ అవుతారో చెప్పలేం.. అలాగే సామాజిక మాధ్యమాల ద్వారా ఇప్పటివరకు ఎంతోమంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. వారి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పారు. సినిమా అవకాశాలూ పొందారు. అసలు ఈ పాటకు అర్థం ఏంటనేది తెలుసుకోవాలని, స్టేజ్ మీద పాడిన భారతి అనే మహిళను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వూ చేశాయి.

ఈ పాట పుట్టుపూర్వోత్తరాల గురించి వివరంగా చెప్పారామె.. చిత్తూరు జిల్లాలోని పారువాలు గ్రామానికి చెందిన భారతి.. చిన్నతనంలో మేకలు, గొర్రెలు కాయడానికి వెళ్లినప్పుడు ఇలాంటి జానపద గేయాలు పాడేవారని.. అప్పుడే తాను కూడా పాడడం నేర్చుకున్నానని అన్నారు.. ఇక ఈ పాటలోని పదాల తాలుకు అర్థాల విషయానికొస్తే.. ‘జడేస్తా చూడు’ అనేది ఆడపిల్లకు జడ వేసేటప్పుడు పాడతామని..‘జంకలికిడి జారు మిఠాయి’ అనేది అమ్మాయి పేరని.. ఇక ‘మొగ్గలఖాలింగో’ అంటే..

అబ్బాయిలు మనవైపు చూడట్లేదు అని అర్థం వస్తుందని చెప్పుకొచ్చారు. ఇక ఈ పాట పాడినందుకుగానూ మోహన్ బాబు తనకు రూ.50 వేలు ఇచ్చారని సంతోషంగా చెప్పుకొచ్చారు భారతి.. కొద్దిరోజుల క్రితం కడపకు చెందిన పెంచల్ దాస్ కూడా ఇలాంటి జానపద గేయానికే సినిమా టచ్ ఇచ్చి ‘దారి చూడు దుమ్మూ జూడు మామ’ అనే పాటతో పాపులర్ అయ్యారు.. అంతరించిపోతున్న జానపద గేయాలను బతికించాలంటే.. ఇలాంటి కళాకారుల్ని ఆదరించాలి.. కళల్ని గౌరవించాలి..

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus