Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Mohan Babu: నటుడిగా, నిర్మాతగా సినిమా రంగంలో మోహన్ బాబు 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం!

Mohan Babu: నటుడిగా, నిర్మాతగా సినిమా రంగంలో మోహన్ బాబు 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం!

  • November 22, 2024 / 09:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mohan Babu: నటుడిగా, నిర్మాతగా సినిమా రంగంలో మోహన్ బాబు 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం!

తెలుగు సినిమా పరిశ్రమలో మోహన్ బాబు (Mohan Babu) నటుడిగా 50వ ఏటలోకి అడుగుపెట్టారు. పాత్రల వైవిధ్యం, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో మోహన్ బాబు (Mohan Babu) గారి ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం అంకితభావం, పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

Mohan Babu

విలన్‌గా రాణించిన రోజులు
1975 నుంచి 1990 వరకు, మోహన్ బాబు(Mohan Babu) గారు భారతీయ సినిమాల్లో విలన్ పాత్రకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చారు. దేశంలో అత్యధికంగా డిమాండ్ ఉన్న ప్రతినాయకులలో ఒకరిగా నిలిచిన ఆయన నటన ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. స్వర్గం నరకం చిత్రంతో పరిశ్రమకు హీరోగా పరిచయం అయినా.. విలన్ పాత్రలతో టాప్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
హీరోగా విజయ శిఖరాలు

1990వ దశాబ్దంలో, మోహన్ బాబు(Mohan Babu) గారు హీరోగా మారి ప్రేక్షకులను తనదైన శైలితో అలరించారు. అల్లుడు గారు, అసెంబ్లీ రౌడీ, పెదరాయుడు వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు ఆయనను స్థాయిని పెంచాయి. తెలుగు చిత్రాల్లో ఆయన నటించిన అనేక చిత్రాలు తరువాత హిందీ, తమిళ భాషల్లో రీమేక్ చేయబడి అక్కడ కూడా భారీ విజయాలు సాధించాయి. తద్వారా ఆయన పేరు జాతీయ స్థాయిలో వినిపించింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు..జీవితంలో పెళ్లి చేసుకోదట!
  • 2 ధనుష్ టు ఏ.ఆర్. రెహమాన్.. కోలీవుడ్లో విడాకులు తీసుకున్న స్టార్స్ వీళ్ళే..!
  • 3 నయన్ ప్రేమ గొడవలపై నాగ్ కామెంట్!

పెదరాయుడు విజయోత్సవాల్లో 200 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించబడింది. ఈ చారిత్రక వేడుకకు మొత్తం రాష్ట్ర రాజకీయ కేబినెట్,ముఖ్యమంత్రి హాజరయ్యారు, ఇది భారతీయ సినిమా చరిత్రలో అత్యంత అరుదైన ఘట్టంగా నిలిచింది. ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు. ఇది మోహన్ బాబు(Mohan Babu) గారి క్రేజ్‌కు నిదర్శనం.

సినిమా, రాజకీయాల్లో కీలక ఘట్టంగా మేజర్ చంద్రకాంత్
మోహన్ బాబు (Mohan Babu) గారి ప్రభావం సినిమాలపై మాత్రమే కాకుండా రాజకీయ రంగానికీ విస్తరించింది. 1993లో ఆయన నిర్మించిన మేజర్ చంద్రకాంత్ చిత్రం.. ఎన్.టి.రామారావు గారి తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంలో కీలక పాత్ర పోషించింది. ఈ చిత్ర 100 రోజుల వేడుక తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సభ సినిమా, రాజకీయ చరిత్రలో ఒక గొప్ప ఘట్టంగా నిలిచింది.

విద్యా రంగంలో విప్లవం
సినిమా రంగంలో విశేష విజయాలను సాధించిన మోహన్ బాబు(Mohan Babu) గారు, విద్యా రంగంలోనూ విశేషమైన సేవలను అందించారు. 1992లో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ విద్యా ట్రస్ట్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా 25% ఉచిత విద్య అందిస్తూ అనేక పేద విద్యార్థులకు అభివృద్ధి అవకాశాలను సృష్టించారు. 2022లో ప్రారంభమైన మోహన్ బాబు విశ్వవిద్యాలయం విద్య పట్ల వారి అంకితభావానికి నిలువుటద్దంగా నిలిచింది.

Mohan Babu

పురస్కారాలు, గౌరవాలు
మోహన్ బాబు (Mohan Babu) గారు అనేక తన సుధీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో గౌరవపురస్కారాలను అందుకున్నారు. 2007లో భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేయగా, 2016 ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఆయన్ను వరించింది.

ఘనమైన వేడుకలు
ఈ చారిత్రక ఘట్టాన్ని మోహన్ బాబు(Mohan Babu) తనయుడు విష్ణు మంచు(Manchu Vishnu) గారు ప్రత్యేకంగా సెలెబ్రేట్ చేయబోతోన్నారు. 2024 డిసెంబర్ నుండి ప్రతి నెల ప్రత్యేక ఈవెంట్లను ప్రారంభిస్తారు. 2025 నవంబర్‌ వరకు ప్రతీ నెలా ఒకటో తేదీన ఈ ఈవెంట్‌లకు సంబంధించిన ప్రకటన వస్తుందని తెలిపారు.

డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప
విష్ణు మంచు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో మోహన్ బాబు గారు మహాదేవ శాస్త్రిగా కనిపించనున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆయన కెరీర్‌లో మరొక మైలురాయిగా నిలుస్తుంది.

సినిమా చరిత్రలో ఒక స్వర్ణ యుగం
సామాన్య వ్యక్తిగా మొదలై.. అసామాన్య వ్యక్తిగా మోహన్ బాబు (Mohan Babu) ఎదిగిన తీరు అందరికీ ఆదర్శనీయం. సినిమా రంగంలో ఇన్నేళ్ల పాటు సేవలు అందిస్తూ వస్తున్నారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ 75 చిత్రాలను నిర్మించారు. ఓ నటుడు ఇలా నిర్మాతగా మారి 75 చిత్రాలు నిర్మించడం అనేది ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో రికార్డ్. ఎక్కువ చిత్రాలు నిర్మించిన ఏకైక నటుడిగా ఆయన రికార్డులు నెలకొల్పారు. ఆయన సాధించిన విజయాలను తలచుకుంటూ ఈ సువర్ణ ఘట్టాన్ని ఘనంగా జరుపుకుందాం. 50 అద్భుత సంవత్సరాలకు మోహన్ బాబు గారికి శుభాభినందనలు.

ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 10 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mohan Babu

Also Read

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

trending news

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

కొడుకు ముందే క్రికెటర్ ను 2వ పెళ్లి చేసుకున్న నటి

8 hours ago
Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

Mangli: పోలీసులను ఆశ్రయించిన మంగ్లీ.. కారణం?

8 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మొదటి రోజు ఎంత కలెక్ట్ చేయొచ్చంటే?

8 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. రొటీన్ ట్యూన్ క్యాచీ లిరిక్స్

9 hours ago
N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

N. Lingusamy: సూర్య సినిమా విషయంలో నేను చేసిన తప్పుల వల్లే రిజల్ట్ తేడా కొట్టింది

9 hours ago

latest news

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

జాన్వీ కపూర్ ప్లేస్ లో మసుదా బ్యూటీ…..నిజమెంత…..?

11 hours ago
Girija Oak: గంటకు ఎంత అని అడుగుతున్నారు.. వైరల్‌ స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

Girija Oak: గంటకు ఎంత అని అడుగుతున్నారు.. వైరల్‌ స్టార్‌ యాక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

12 hours ago
20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు, 3 విడాకులు.. నటి సంచలనం

20 ఏళ్లలో 3 పెళ్లిళ్లు, 3 విడాకులు.. నటి సంచలనం

12 hours ago
Rahul Sipligunj &  Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

Rahul Sipligunj & Harinya: ఘనంగా రాహుల్ సిప్లిగంజ్-హరిణ్య రెడ్డి ల పెళ్లి వేడుక!

12 hours ago
Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

Rakul Preet Singh: టాలీవుడ్ హీరోలపై రకుల్ ప్రీత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్…..!

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version