చిత్ర పరిశ్రమలో కాపీ ఆరోపణలు సర్వ సాధారణం. స్టార్ డైరెక్టర్స్ గా పరిశ్రమను ఏలుతున్న రాజమౌళి, త్రివిక్రమ్ లాంటి వారిపైనే కాపీ ఆరోపణలు రావడం జరిగింది. దీనిని సదరు దర్శకులు మేము కేవలం స్ఫూర్తి పొందాం అంటారు. ఇక సినిమాకు కావలసిన 24 క్రాఫ్ట్స్ లో అతి ముఖ్యమైన మ్యూజిక్ విషయంలో కూడా కాపీ ఆరోపణలు వస్తూ ఉంటాయి. హాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా అనేక సినిమాలలోని ట్యూన్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ లేపేస్తూ ఉంటారు. కొంచెం మార్పులు చేర్పులు చేసి మసాలా అద్ది ప్రేక్షకులకు వడ్డించేస్తుంటారు.
ఈ ఆచారం అనాదిగా వస్తూ ఉన్నదే. టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఈ ఆరోపణలు ఎదుర్కోవడం జరిగింది. కాగా ఇటీవల విడుదలైన వి మూవీ బీజీఎమ్ విషయంలో నెటిజన్స్ థమన్ ని ఏకిపారేశారు. వి మూవీ కోసం థమన్ ఇచ్చిన బీజీఎమ్ తమిళ చిత్రం రాక్షసన్, మరియు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చిత్రాల బీజీఎమ్ ని పోలిఉంది. దీనితో సోషల్ మీడియాలో కాపీ క్యాట్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. కాగా ఈ ఆరోపణలను చిత్ర దర్శకుడు మోహన కృష్ణ ఇంద్రగంటి కొట్టిపారేశారు.
ఒకే తరహా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాడడం వలన అలా అనిపించిందని, కొందరికి మ్యూసిక్ సెన్స్ లేకపోవడం వలెనే ఈ సమస్య అని ఆయన థమన్ ని వెనకేసుకు వచ్చాడు. ఇన్స్ట్రుమెంట్స్ ఒకటే అయితే ట్యూన్ ఒకలాగే వస్తుందా అనేది ఇక్కడ పాయింట్. ఆ బీజీఎమ్ ఒకే చేసిన తన పరువు కూడా పోతుందనుకున్నాడో ఏమో, మోహన కృష్ణ తప్పందా ప్రేక్షకులదే అని త్రోసిపారేశారు.