అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూడు రోజుల క్రితం విడుదలై పాజిటివ్ టాక్ తో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది. అయితే ఈ సినిమా వచ్చే నెల 12వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని జోరుగా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. లవ్ స్టోరీ మూవీ ఆహా ఓటీటీలో రిలీజైన నాలుగు వారాలకు స్ట్రీమింగ్ కాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కూడా అదే తరహాలో రిలీజ్ కానుందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
అయితే గీతా ఆర్ట్స్ కు సన్నిహిత నిర్మాతలలో ఒకరైన శ్రీనివాస కుమార్ స్పందిస్తూ ఆ వార్తల్లో నిజం లేదని చెప్పుకొచ్చారు. మరింత ఆలస్యంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఓటీటీలో రిలీజవుతుందని ఆయన వెల్లడించారు. అఖిల్ అభిమానులు సినిమా రిలీజైన ఎనిమిది వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యువతను ఆకట్టుకుంటోంది.
చాలా సంవత్సరాల తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ ఖాతాలో హిట్ చేరింది. అఖిల్ కోరుకున్న స్థాయి హిట్ కాకపోయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ కెరీర్ లో తొలి హిట్ అని చెప్పవచ్చు. సక్సెస్ ట్రాక్ లో ఉన్న పూజా వరుస విజయాలను ఖాతాలో వేసుకుంటూ గోల్డెన్ లెగ్ గా ప్రూవ్ చేసుకున్నారు. అఖిల్ ఏజెంట్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటారో లేదో చూడాల్సి ఉంది.