Akhil: బ్లాక్ బస్టర్ బ్యాచిలర్ టీఆర్పీ ఎంతో తెలుసా?

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ నటించిన అఖిల్, హలో, మిస్టర్ మజ్ను సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా ఫ్లాపులుగా నిలిచాయి. అయితే గతేడాది విడుదలైన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అఖిల్ తొలి సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నారు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించగా గీతా ఆర్ట్స్2 బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది. థియేటర్లలో డీసెంట్ కలెక్షన్లను సాధించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తాజాగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ లో ఒకటైన స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైంది.

ఈ సినిమా బుల్లితెరపై కూడా మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ఏకంగా 9.31 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆధునిక జీవితంలో యువత ఆలోచనా తీరు గురించి బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో ప్రస్తావించడం గమనార్హం. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ సక్సెస్ ను సాధించడంతో ఈ డైరెక్టర్ కు కొత్త సినిమా ఆఫర్లు కూడా వస్తున్నాయి. అయ్యగారు బుల్లితెరపై కూడా సక్సెస్ సాధించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

అదే వీకెండ్ లో ప్రసారమైన ఇతర సినిమాలతో పోల్చి చూస్తే ఈ సినిమాకే ఎక్కువ రేటింగ్ వచ్చింది. ప్రేక్షకుల్లో అఖిల్ కు క్రేజ్, ఫాలోయింగ్ పెరిగిందనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 50 కోట్ల రూపాయలకు పైగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గ్రాస్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా, నేహాశెట్టి, ఈషా రెబ్బా చిన్నచిన్న పాత్రల్లో కనిపించారు. ఆహా ఓటీటీలో కూడా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

అఖిల్ తర్వాత సినిమా ఏజెంట్ పేరుతో సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం 45 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఖర్చు చేస్తున్నారని సమాచారం. సైరా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus