Mrunal Thakur: దుల్కర్ సల్మాన్ బర్త్ డే… స్పెషల్ విషెస్ తెలిపిన మృణాల్!

సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు దుల్కర్ సల్మాన్, నటి మృణాల్ ఠాకూర్. ఈ సినిమా ద్వారా వీరిద్దరూ రామ్ సీతగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను కూడా సొంతం చేసుకున్నారు.ఇలా వీరిద్దరూ మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో అనంతరం తెలుగులో వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇకపోతే శుక్రవారం నటుడు దుల్కర్ సల్మాన్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది అభిమానులు సినీ సెలబ్రిటీలు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రమంలోనే సీతామహాలక్ష్మి రామ్ కి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. అయితే నటి మృణాల్ ఎంతో విభిన్నంగా నటుడు దుల్కర్ కు శుభాకాంక్షలు తెలిపారు.సీతారామం సినిమా షూటింగ్ లొకేషన్లో దిగినటువంటి కొన్ని ఫోటోల గురించి ఈమె (Mrunal Thakur) తెలియజేస్తూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

వినయం, ప్రతిభ, ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనసు కలిగిన ఇలాంటి సూపర్‌స్టార్‌ను నాకు పరిచయం చేసిన ‘సీతారామం’ మేకర్స్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు ఎన్నో రకాలుగా నాలో స్ఫూర్తిని నింపారు మీ నుంచి చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. కెరియర్ మొదట్లో ఇతర భాషలో మాట్లాడాలి అంటే భయపడే నాకు ఎంతో ధైర్యాన్ని నింపారు. ఇలా నా మొదటి సినిమాని ఎంతో ప్రత్యేకంగా మార్చినందుకు థాంక్యూ హ్యాపీ బర్త్ డే దుల్కర్ సల్మాన్ అంటూ ఈమె పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ చేసినటువంటి పోస్ట్ పై నటుడు దుల్కర్ స్పందిస్తూ..

ఇది చాలా స్పెషల్ గా ఉంది మీలో ప్రేరణ నింపడానికి వేరే వ్యక్తులు అవసరం లేదు.మీరు ప్రత్యేకమైన వ్యక్తి మీరు ఎప్పటికైనా సీతగారుగా గుర్తుండిపోతారు అంటూ ఈ సందర్భంగా ఈయన రిప్లై ఇస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus