ఫ్యాషన్ షోలు, ర్యాంప్ వాక్‌లు మృణాల్ ఠాకూర్‌కి (Mrunal Thakur) కొత్తేం కాదు. షో స్టాపర్‌గా ఆమె ఇప్పటికే చాలా షోలకు వెళ్లింది. తనదైన శైలిలో దుస్తులతో కాస్త ఎక్కువ హాట్‌గానే షోలను ముగిస్తూ ఉంటుంది. మన దగ్గరకు ఆమె వచ్చాక ఇలాంటివి తగ్గాయి కానీ.. బాలీవుడ్‌లో ఉండి చాలానే చేసింది. అయితే రీసెంట్‌గా ఓ షోకి ఆమె ధరించిన డ్రెస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దానికి ఆ డ్రెస్ ఒక కారణం అయితే, దాని కోసం పడ్డ కష్టం మరో కారణం.
బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్ కోసం అదిరిపోయే లెహెంగాతో మృణాల్ ర్యాంప్ వాక్ చేసింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ డిజైనర్ అను పెల్లకూరు డిజైన్ చేసిన లెహెంగా అది. ‘స్వర్ణి రాహా’ పేరుతో కొత్త కలెక్షన్‌లో భాగంగా ఆ లెహంగాను మృణాల్ ఠాకూర్‌తో ప్రదర్శించారు. పింక్ కలర్ లెహెంగాపై ఎంబ్రాయిడరీతో, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మేళవించేలా రూపొందించారు. బటర్‌ఫ్లై హెమింగ్ బ్లౌజ్ మరో హైలైట్.
మొత్తంగా ఈ లెహెంగాను రూపొందించడానికి 1400 గంటల సమయం పట్టిందనేది మెయిన్ పాయింట్. ఈ లెహంగా డిజైన్ చేసిన అను రెండుసార్లు కాలేజీ మధ్యలోనే చదువు ఆపేసింది. అప్పటికే ఫ్యాషన్ డిజైనింగ్‌లో ప్రాథమిక నైపుణ్యాలు తెలిసిన ఆమె.. ‘మిస్ యూఏఈ ఫైనలిస్ట్’ కోసం మూడు అవుట్‌ఫిట్స్ రూపొందిందచింది. ‘తలాషా’ పేరుతో ఓ ఫ్యాషన్ లేబుల్‌ని ప్రారంభించి.. చేతి అల్లికలతో హుందాగా దుస్తులు రూపొందిస్తుంటారు ఆమె. అను చేసే ఫ్యాషనబుల్ అవుట్‌ఫిట్స్ అంటే.. సెలబ్రిటీలకు, సామాన్యులకు కూడా ఇష్టం.
ఇక ఆ డ్రెస్‌ను చూసిన కుర్రకారు అయితే మృణాల్ మరోసారి సీత లుక్‌లో కాస్త ట్రెండీగా కనిపించింది అంటూ మురిసిపోతున్నారు. ఇంకొందరు అయితే ఆరాధ్య దేవత అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. ఏ మాటకు ఆ మాట ఆమె ఆ డ్రెస్‌లో అయితే అదిరిపోయింది మరి. మీరు కూడా ఆ ఫొటోలు చూసే ఉంటారు. మెచ్చుకునే ఉంటారు కూడా.