Bigg Boss 6: ఆ సెంటిమెంట్ తో ‘బిగ్ బాస్ 6’ కి ఆ ముహూర్తం ఫిక్స్ చేశారట..!

‘బిగ్ బాస్’ కి తెలుగు నాట ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. హిందీతో పాటు తెలుగులో కూడా ఈ షో సూపర్ సక్సెస్ సాధించింది. సౌత్ లో.. కేవలం తెలుగులో మాత్రమే బిగ్ బాస్ కు ఎక్కువ ఆదరణ లభించింది.మొదటి సీజన్ ని ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వల్ల ఈ షో ఇక్కడి జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆ తర్వాత నాని హోస్ట్ చేసిన విధానానికి విమర్శలు వెల్లువెత్తాయి.

దీంతో తెలుగులో ‘బిగ్ బాస్’ ఇక నిలబడడం కష్టమే అని అంతా అనుకున్నారు. కానీ నాగార్జున హోస్ట్ గా చేయడం మొదలుపెట్టినప్పటి నుండి ‘బిగ్ బాస్’ కు బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది. ఆల్రెడీ 5 సీజన్లు సక్సెస్ ఫుల్ గా ముగిసాయి. ఈ ఏడాది ఓటీటీ సీజన్ ను కూడా మొదలుపెట్టారు కానీ అది అనుకున్నంత సక్సెస్ అవ్వలేదు. దీంతో త్వరలో ప్రారంభం కాబోయే సీజన్ 6 కి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ‘బిగ్ బాస్’ నిర్వాహకులు.

అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 4, 2022 ఆదివారం నాడు బిగ్ బాస్ సీజన్ 6 ప్రారంభం కానుందని తెలుస్తోంది.ఈ సీజన్ ను కూడా నాగార్జున హోస్ట్ చేయబోతున్నారు.అయితే సీజన్ 6 ను సెప్టెంబర్ లో ప్రారంభించడం వెనుక ఓ కథ ఉంది.గతంలో ‘బిగ్ బాస్’ సీజన్ 4 ని.. సెప్టెంబర్ 6 (2020) స్టార్ట్ చేయగా..దానికి రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్ ను నమోదు చేసింది. బిగ్ బాస్ తెలుగు హిస్టరీలోనే అత్యధిక రేటింగ్ సాధించింది సీజన్‌ 4 లోనే కావడం విశేషం.

నాగార్జున హోస్ట్ చేసిన సీజన్ 3 రికార్డులన్నింటినీ బద్దలు కొట్టి 21.7 TVR రేటింగ్ ను ‘బిగ్ బాస్ 4’ సాధించింది.ఫినాలే ఎపిసోడ్ కు కూడా హిందీ బిగ్ బాస్ కు కూడా రానంత వ్యూవర్‌షిప్ వచ్చింది. కంటెస్టెంట్లుగా వచ్చిన వారు పెద్దగా తెలిసిన మొహాలు కాకపోయినా ఆ రేంజ్ టి.ఆర్.పి నమోదు చేయడం మామూలు విషయం కాదు.సీజన్ 5 ని కూడా సెప్టెంబర్ లోనే స్టార్ట్ చేశారు. దీనికి కూడా మంచి రేటింగ్ నమోదైంది. అందుకే సీజన్ 6 విషయంలో కూడా ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేలా చూడాలనేది బిగ్ బాస్ నిర్వాహకుల ఆశగా తెలుస్తుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus