కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) నటించిన ‘ఖైదీ’ (Kaithi) సినిమా పెద్దగా చప్పుడు లేకుండా వచ్చి పెద్ద హిట్ అయ్యింది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. రెండు చోట్లా కూడా విజయ్ (Vijay Thalapathy) నటించిన ‘విజిల్’ (Bigil)(తమిళంలో ‘బిగిల్’) పోటీగా ఉన్నప్పటికీ.. వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించింది ‘ఖైదీ’. ఈ సినిమాలో చాలా సన్నివేశాలు మాస్ ఆడియన్స్ ని అమితంగా ఆకట్టుకున్నాయి.డైరెక్టర్ రైటింగ్, దానికి సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ పనితనం..
Khaidi
ఇలా రెండూ కలిపి ‘ఖైదీ’ లో ప్రతి ఫ్రేమ్ అద్భుతం అనేలా చేశాయి. ఇక ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ వస్తుందని.. రిలీజ్ టైంలోనే ప్రకటించారు. సినిమా క్లైమాక్స్ లో లీడ్ కూడా ఇవ్వడం జరిగింది.అంతా బాగానే ఉంది.. కానీ 5 ఏళ్ళు అయినా ‘ఖైదీ 2’ స్టార్ట్ అవ్వకపోవడంతో ‘ఈ ప్రాజెక్టు ఉంటుందా?’ అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇటీవల కార్తీ వీటికి క్లారిటీ ఇచ్చాడు. నెక్స్ట్ ప్రాజెక్టు ‘ఖైదీ 2’ అని స్పష్టం చేశారు.
అది ‘ఢిల్లీ’ టైటిల్ తో ఉండొచ్చేమో అని తెలిపారు. మరోపక్క ‘ఖైదీ 2’ కి సంగీత దర్శకుడిని కూడా మార్చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. ‘ఖైదీ 2’ లోకేష్ (Lokesh Kanagaraj) తెరకెక్కించిన సినిమాలు అన్నిటికీ అనిరుధ్ సంగీతం (Anirudh Ravichander) అందించాడు. ప్రస్తుతం చేస్తున్న ‘కూలీ’ కి (Coolie) కూడా అతనే సంగీత దర్శకుడు. దీంతో ఆ రూమర్స్ ఇంకా ఎక్కువయ్యాయి. ‘ఖైదీ’ కి సామ్ సి ఎస్ సంగీతం అందించాడు.
పాటలు లేని ఆ సినిమాలో సామ్ సి ఎస్ (Sam C. S.) అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాంటి సంగీత దర్శకుడిని ఎలా తప్పిస్తారు అనే డిస్కషన్స్ కూడా కోలీవుడ్లో షురూ అయ్యాయి. దీంతో సంగీత దర్శకుడు సామ్ సి ఎస్ .. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది. ‘నా నెక్స్ట్ ప్రాజెక్టు ‘ఖైదీ 2′ కోసం దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో మళ్ళీ చేతులు కలపబోతున్నట్టు’ చెప్పుకొచ్చాడు సామ్ సి ఎస్.