ఇదివరకంటే ప్రపంచ సినిమా మన సౌత్ ఇండియన్స్ కు అందుబాటులో ఉండేది కాదు కాబట్టి మన దర్శకులు, సంగీత దర్శకులు హ్యాపీగా హాలీవుడ్ నుంచి కథలు, ట్యూన్స్ కాపీ కొట్టేసి ప్రేక్షకుల్ని మోసం చేసేవారు. కానీ.. ఇంటర్నెట్ పుణ్యమా అని ఎప్పుడైతే ఆడియన్స్ కు వరల్డ్ సినిమా అందుబాటులోకి వచ్చిందో అప్పట్నుంచి దర్శకనిర్మాతలు, సంగీత దర్శకులు కాపీ కొట్టడానికి భయపడుతున్నారు ఎక్కడ తాము దొరికిపోతామోనన్న భయం గట్టిగా పట్టుకొంది. కానీ.. ఎవరికీ దొరకదు అనుకున్నాడో లేక దొరికినా పట్టించుకోరు అనుకున్నాడో తెలియదు కానీ.. ఓ హాలీవుడ్ సినిమా నుంచి కథను చాలా గట్టిగా ఐఎన్‌ఎస్ ఫైర్ అయ్యాడు వక్కంతం వంశీ.
ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “నా పేరు సూర్య” స్టోరీ లైన్ 2002లో హాలీవుడ్ లో విడుదలైన “ఆంటోన్ ఫిషర్” అనే ఆంగ్ల చిత్రానికి చాలా దగ్గర పోలికలున్నాయి. అక్కడికి ఇక్కడికి తేడా ఏంట్రా అంటే, ఆ సినిమాలో హీరో నేవీ సోల్జర్ అయితే.. మన సినిమాలో అల్లు అర్జున్ ఆర్మీ సోల్జర్. ఈ తేడా మరియు కొన్ని కమర్షియల్ అంశాలు తప్పితే మిగతాదంతా ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉండడం గమనార్హం. మరి మూడేళ్లపాటు కష్టపడి రాసుకొన్నానని చెప్పిన వంశీ ఈ ఇన్స్పిరేషన్ విషయంలో ఏమని, ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.