Naga Chaitanya: గతంలో హీరో నాగచైతన్య అలా ఉండేవారా?

  • July 22, 2022 / 04:31 PM IST

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కి థియేటర్లలో విడుదలవుతున్న థాంక్యూ సినిమాకు రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ ప్రీమియర్లు ప్లాన్ చేయడంతో థాంక్యూ తొలిరోజు కలెక్షన్లు భారీగానే నమోదయ్యే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. థాంక్యూ ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య షాకింగ్ విషయాలను వెల్లడించారు. ఫ్యామిలీ కథలతో తెరకెక్కిన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టమని చైతన్య అన్నారు.

ఫ్యాన్స్ కోసం ప్రతిసారి కొత్తగా ప్రయత్నించాలని నాకు ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అలా చేసిన మూవీ థాంక్యూ అని చైతన్య చెప్పుకొచ్చారు. థాంక్యూ మూవీని అభిరామ్, ప్రియ అనే పాత్రలు నడిపిస్తాయని చైతన్య కామెంట్లు చేశారు. మన లైఫ్ లో ఎవరెవరికో థాంక్స్ చెప్పాలని అనుకుని చెప్పలేకపోతున్నామని చైతన్య చెప్పుకొచ్చారు. థాంక్యూ మూవీ చూసిన తర్వాత కచ్చితంగా వాళ్లను గుర్తు చేసుకొని మరీ థ్యాంక్స్ చెబుతామని చైతన్య కామెంట్లు చేశారు.

థాంక్యూ మూవీ నన్ను చాలా మార్చిందని చైతన్య చెప్పుకొచ్చారు. ఒకప్పుడు నా మనసులో ఫీలింగ్స్ ను లోపల దాచుకునేవాడినని ఇప్పుడు బయటకు వెల్లడిస్తున్నానని చైతన్య కామెంట్లు చేశారు. చైతన్య చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొనగా ఆ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న చైతన్య సినిమాసినిమాకు నటుడిగా ఎదగడంతో పాటు బాక్సాఫీస్ వద్ద విజయాలను సొంతం చేసుకుంటున్నారు. చైతన్య తర్వాత ప్రాజెక్ట్ లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది. సినిమాసినిమాకు నాగచైతన్యకు అంతకంతకూ క్రేజ్ పెరుగుతోంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus