Naga Chaitanya, Nikhil: నాగచైతన్య, నిఖిల్ లలో విజేత ఎవరో?

నాగచైతన్య హీరోగా విక్రమ్ కె కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన థాంక్యూ సినిమా జులై 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే. మొదట జులై 8వ తేదీన థియేటర్లలో థాంక్యూ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించిన దిల్ రాజు సినిమాపై ఆశించిన స్థాయిలో అంచనాలు ఏర్పడకపోవడంతో రిలీజ్ డేట్ ను మార్చారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందించగా ఇప్పటికే విడుదలైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఈ సినిమా నుంచి మరో మూడు పాటలు రిలీజ్ కావాల్సి ఉండగా ట్రైలర్ రిలీజ్ కావాల్సి ఉంది.

అయితే చైతన్య అభిమానులు మాత్రం ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే ఈ సినిమాను నిర్మించారని సమాచారం అందుతోంది. అయితే సినిమా రిలీజ్ డేట్ ను మార్చడం ద్వారా తనకు సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ కు చైతన్య షాకిచ్చారు. జులై 22వ తేదీన థాంక్యూ సినిమాతో పాటు కార్తికేయ2 సినిమా కూడా థియేటర్లలో విడుదల కానుంది. కార్తికేయ2 సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు చందూ మొండేటి దర్శకుడు కాగా నాగచైతన్య చందూ మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన ప్రేమమ్ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందే. అయితే చందూ మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా రిలీజైన రోజునే థాంక్యూ సినిమాను రిలీజ్ చేస్తూ చైతన్య ఆ డైరెక్టర్ కు ఒక విధంగా షాకిచ్చారని చెప్పాలి. చైతన్య, నిఖిల్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమాలలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి.

రెండు సినిమాలు వేర్వేరు జానర్స్ లో తెరకెక్కినా ప్రేక్షకులు ఏ సినిమాపై ఆసక్తి చూపిస్తారో తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరు హీరోలు తమ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చైతన్య, నిఖిల్ వరుస సినిమాలలోనటిస్తూ కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus