Naga Chaitanya: కథలో మార్పులు చేయమన్న చైతన్య.. కానీ?

నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న లవ్ స్టోరీ మూవీ ఈ నెల 24వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చైతన్య మాట్లాడుతూ లవ్ స్టోరీ సినిమా కోసం తను అనుభవించిన డ్యాన్స్ కష్టాలను చెప్పుకొచ్చారు. తనకు డ్యాన్స్ అతిపెద్ద వీక్ నెస్ అని సినిమాలో జుంబా ఇన్ స్ట్రక్టర్ గా నటించమని శేఖర్ కమ్ముల చెప్పిన తర్వాత తాను ఆ పాత్రను మార్చమని కోరానని చైతన్య తెలిపారు.

సాయిపల్లవి డ్యాన్సర్ కావడంతో ఇంకా కష్టమని తాను భావించానని చైతన్య చెప్పుకొచ్చారు. అయితే శేఖర్ కమ్ముల మాత్రం కథలో మార్పులు చేయడానికి ఇష్టపడలేదని అందువల్ల డ్యాన్స్ రిహార్సల్స్ కోసం ఎంతో కష్టపడాల్సి వచ్చిందని చైతన్య పేర్కొన్నారు. ఎంతో కష్టపడి ఎలాగోలా లవ్ స్టోరీ సినిమాను పూర్తి చేశానని చైతన్య వెల్లడించారు. హీరోయిన్ సాయిపల్లవి స్వతహాగా డ్యాన్సర్ అయినా ఈ సినిమా కోసం కష్టపడాల్సి వచ్చిందని సాయిపల్లవి తెలిపారు. రౌడీ బేబీ సాంగ్ తో పోలిస్తే సారంగదరియా పాట కోసమే ఎక్కువ కష్టపడ్డానని సాయిపల్లవి చెప్పుకొచ్చారు.

లవ్ స్టోరీ కోసం ఒక పాట వర్షంలో షూట్ చేయాల్సి వచ్చిందని సాయిపల్లవి అన్నారు. ఆ పాట వల్ల కండరాలు పట్టేశాయని రాత్రిపూట చలిలో సారంగదరియా పాట షూట్ లో పాల్గొనాల్సి వచ్చిందని సాయిపల్లవి వెల్లడించారు. లవ్ స్టోరీలో ఈ రెండు పాటల కొరకు చాలా కష్టపడ్డానని సాయిపల్లవి తెలిపారు. చైతన్య, సాయిపల్లవి లవ్ స్టోరీతో హిట్ అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus