విడాకుల తర్వాత మొదటిసారి సమంతతో ఉన్న ఫోటోని షేర్ చేసిన చైతన్య!

తెలుగు చిత్ర పరిశ్రమలో నటీనటులుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో సమంత నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఏం మాయ చేసావే సినిమా ద్వారా మొదటిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా సమంతకు మొదటి సినిమా కాక నాగచైతన్యకు రెండో సినిమా కావడం విశేషం.ఇలా వీరిద్దరి కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ కావడంతో అనంతరం ఈ జంట మరో మూడు సినిమాలలో కలిసి నటించారు.

ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించడం ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీయడం అనంతరం కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోవడం కూడా జరిగింది.ఇలా విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత ఎవరి కెరియర్లో వారు బిజీగా ఉంటూ వచ్చారు. అయితే విడాకులు తీసుకున్న తర్వాత మొదటిసారి నాగచైతన్య సమంతతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటో వైరల్ గా మారింది.

ఇలా నాగచైతన్య సమంతతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే వీరిద్దరూ కలిసి నటించిన ఏం మాయ చేసావే సినిమా 13 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో నాగచైతన్య సమంతతో కలిసి ఉన్నటువంటి ఏ మాయ చేసావే పోస్టర్ ను షేర్ చేస్తూ సెలెబ్రేటింగ్ థర్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏ మాయ చేసావే అంటూ పోస్ట్ చేశారు దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

ఇక సమంత కూడా ఈ సినిమా 13 సంవత్సరాల పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాలో జెస్సి పాత్రలో నటించినటువంటి లుక్స్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ 13 ఇయర్స్ ఆఫ్ జెస్సిఅంటూ లవ్ సింబల్స్ తో షేర్ చేశారు. ఇలా నాగచైతన్య సమంత షేర్ చేసినటువంటి ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకోగా సమంత మాత్రం ఖుషి, సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus