Samantha, Naga Chaitanya: సమంత వేసుకున్న ‘చై’ ముద్ర… కొత్త ఫొటోల్లో!

  • June 10, 2022 / 03:03 PM IST

పచ్చ బొట్టు చెరిగిపోదులే… అనే పాట గుర్తుందా? ఎన్నోఏళ్ల క్రితం వచ్చిన ఈ పాట ఇప్పటికే మన మనసుల్లో మారుమోగుతూనే ఉంటుంది. ఇంచా చెప్పాలంటే వేసుకున్న పచ్చబొట్టు చెరిగిపోయేవరకు అన్నమాట. ఇప్పుడు ఈ పచ్చబొట్టు పాట ఎందుకు గుర్తొచ్చింది అంటారా? సమంత ఇటీవల షేర్‌ చేసిన కొన్ని ఫొటోల్లో ఓ పచ్చబొట్టు కనిపించేసరికి ఆ పాట గుర్తొచ్చింది. ప్రేమ ఉన్నప్పుడు వేసుకునే పచ్చబొట్టు.. ప్రేమ పోయాక కూడా అలానే ఉండిపోతే.. ఇలానే ఉంటుంది కదా.

పచ్చబొట్టు శరీరం మీద ఎక్కడ వేసుకోవాలి అని అనేది వేసుకోవాల్సిన వారి ఇష్టం. అయితే వేసుకున్న పచ్చబొట్టును తీసేయడం అంత ఈజీ కాదు. కొన్నిసార్లు అసాధ్యం కూడా. ఈ మాటను సమంతనే ఆ మధ్య ఓ సందర్భంలో చెప్పింది. గతంలో ఆమె వేసుకున్న పచ్చబొట్ల గురించి ఆలోచించే ఇలా చెప్పింది. అలా ఆమె గతంలో వేసుకున్న ఓ పచ్చబొట్టు ఇప్పుడు సోషల్ మీడియాలో రెండు పిక్స్‌ వైరల్‌ అవ్వడానికి కారణం అయ్యాయి.

ఓ ఇంటర్నేషనల్‌ ఫ్యాషన్‌ బ్రాండ్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సమంత ఇటీవల ఓ ఫొటో షూట్‌ చేసింది. స్పోర్స్ట్‌ వేర్‌ను తలపించేలా ఉన్న హాట్‌ డ్రెస్‌లో సమంత కుర్రకారు మనసులో మంటలు రేపింది. అయితే ఈ క్రమంలో ఆమె పక్కటెముకల మీద ఉన్న టాటూ కనిపించేసరికి సోషల్‌ మీడియాలో చర్చ కూడా రేపింది. ఆ టాటూ ఏంటంటే… నాగచైతన్య పేరు. ‘చై’ అని గతంలో ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు వేసుకున్నది. కొన్ని నెలల క్రితం ఇద్దరూ విడిపోయారు. కానీ టాటూ ఉండిపోయింది.

‘‘ఇన్నాళ్లు ఎవరికీ కనిపించకుండా దాచిన టాటూను ఫైనల్‌గా చూపించేస్తున్నాను. నా భర్త చై నా ప్రపంచం’’ అంటూ అప్పట్లో వైట్‌ చీరలో స్టిల్‌ షేర్‌ చేసింది సమంత. చై నుండి విడిపోయిన తర్వాత ఆ పచ్చబొట్టును సమంత చెరిపేసుకుందని అంతా అనుకున్నారు. సర్జరీ చేయించుకొని మరీ ఈ టాటూను తీయించుకుందంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ కొత్త ఫొటో షూట్‌లో ఆ టాటూ కనిపించింది. నాగచైతన్యతో తెగదెంపులు చేసుకున్న సమంత, ఈ పచ్చ బొట్టును ఎందుకు ఉంచిందనేది ఆమెనే చెప్పాలి.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus