Naga Chaitanya, Sai Pallavi: ‘లవ్‌స్టోరీ’ ముద్దు గురించి ఆసక్తికర విషయం

Ad not loaded.

‘ఏంది ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా…’ ఈ డైలాగ్‌ గుర్తుందా?…. గుర్తుండే ఉంటుంది లెండి అంత బాగా చూపించారు మరి ‘లవ్‌స్టోరీ’ ట్రైలర్‌లో ఆ సీన్‌ని. అయితే ఆ ముద్దు వెనుక అంతకంటే అద్భుతమైన విషయం ఉందని తెలుసా? ఆ మధ్య ఒకసారి సాయిపల్లవి ఆ ముద్దు ఒరిజినల్‌ ముద్దు కాని అని చెప్పింది అనుకోండి. కానీ ముద్దు కాని ఆ ముద్దు సీన్‌ కోసం నాగచైతన్య ఆరు గంటలు తీసుకున్నాడని తెలుసా?

ట్రైలర్‌లో అప్పుడు, సినిమాలో ఇప్పుడు ఆ సీన్‌ చూస్తే… ఈ విషయం మీకు కూడా తెలుస్తుంది. ఏముంది మెట్రో ట్రైన్‌లో కూర్చున్న నాగచైతన్యకు, పక్కనే కూర్చున్న సాయిపల్లవి వచ్చి లిప్‌లాక్‌ ఇస్తుంది. దానికి చైతు రియాక్ట్‌ అయ్యి… కన్నీళ్లు పెట్టుకుంటాడు. చెప్పడానికి సులభంగానే కనిపిస్తున్నా… ఈ సీన్‌ కోసం చిత్రబృందం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరు గంటలు కష్టపడిందట. చైతన్య నుండి పర్‌ఫెక్ట్ ఎక్స్‌ప్రెషన్‌ కోసం ఆ పని చేశారట.

డైలాగ్‌లో చెప్పినట్లు… ఆ సీన్‌లో చైతన్య కళ్లెంబడి నీళ్లు తిరుగుతాయి. ఆ సీన్‌ చూడటానికి అద్భుతంగా ఉంటుంది. అది నిజం ముద్దు కాదు… ఫీల్‌ నటించాలి. అందులోనూ ఒరిజినల్‌గా కనిపించాలి. ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ ఫీల్‌ కోసం శేఖర్‌ కమ్ముల పట్టుబట్టారట. తనకు కావాల్సినట్లు సీన్‌ వచ్చేంతవరకు రీటేక్‌లు చేస్తూనే ఉన్నారట. అలా ఆ సీన్‌ కోసం సుమారు ఆరు గంటలు మెట్రోలోనే ఉన్నారట టీమ్‌ అంతా. అంత కష్టపడి చేసిన సీన్‌ నడివి ఓ 25 సెకన్లు ఉంటుంది. కానీ ఫీల్‌ ముందు ఈ కష్టం లెక్కలోకి రాదు కదా. అందుకే అంత కష్టపడ్డారు.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus