Naga Chaitanya: ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో చైతు ‘దూత’!

టాలీవుడ్ లో హీరోగా తన సత్తా చాటిన అక్కినేని నాగచైతన్య ఇప్పుడు డిజిటల్ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ చైతు ప్రధాన పాత్రలో ‘దూత’ అనే సిరీస్ ను రూపొందిస్తోంది. దీన్ని దర్శకుడు విక్రమ్ కె కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల ముంబైలో ఈ వెబ్ సిరీస్ లాంచింగ్ ఈవెంట్ ను ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేసింది.

మంచి ఫామ్ లో ఉన్న సమయంలో చైతు ఇలా ఓటీటీ ప్రాజెక్ట్స్ వైపు ఆసక్తి చూపించడం విశేషం. ‘మనం’, ‘థాంక్యూ’ సినిమాల తరువాత వరుసగా మూడోసారి చైతూతో కలిసి పని చేస్తున్నారు దర్శకుడు విక్రమ్. ఇప్పుడు ఈ సిరీస్ కి సంబంధించిన స్టోరీ ఎలా ఉండబోతుందో కొన్ని లీక్స్ బయటకు వచ్చాయి. ‘దూత’ హారర్ జోనరే అయినప్పటికీ.. ట్రీట్మెంట్ మాత్రం డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం. విక్రమ్ కె కుమార్ అప్పట్లో మాధవన్ తో తీసిన ’13బి’ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఊహించని పాయింట్ తో ఈ సినిమాను రూపొందించారు. పగ తీర్చుకోవాలనుకునే ఆత్మ ఒక మీడియంను ఎంచుకొని కక్ష సాధిస్తుంటుంది. టీవీ సీరియల్ పాత్రల ద్వారా భయాన్ని సృష్టించి విక్రమ్ చేసిన ప్రయోగం అన్ని భాషల్లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఈ ‘దూత’ సిరీస్ లో కూడా ఒక షాకింగ్ ఎలిమెంట్ ఉంటుందట. నిర్జీవంగా ఉండే వస్తువులు తప్పు చేసిన వాళ్ల మీద ప్రతీకారం తీర్చుకుంటాయి. చట్టంలో వీటికి శిక్ష ఉండదు. పోలీసులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుతుంది.

చైతు కుటుంబాన్ని ఒక ప్రమాదం చుట్టుముడుతుంది. ఇంతకీ ‘దూత’ ఎవరు..? కంటికి కనిపించని దెయ్యాల నుంచి తన ఫ్యామిలీని చైతు ఎలా కాపాడుకున్నాడనే పాయింట్ మీద ఈ సిరీస్ ను రూపొందిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ కి విక్రమ్ కుమార్ స్క్రీన్ ప్లే యాడ్ అయితే మేజిక్ రిపీట్ అవ్వడం ఖాయం.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus