పిల్లలు చేసిన తప్పుల్ని తల్లిదండ్రులు సరిదిద్దడమే కాదు అప్పుడప్పుడు వెనకేసుకొస్తుంటారు. ఒక్కోసారి ఆ వెనకేసుకురావడం పుణ్యమా అని సుపుత్రులు చెడిపోతే.. చాలా తక్కువసార్లు మాత్రమే వారు చేసిన తప్పులను తెలుసుకొని వాటిని రిపీట్ చేయకుండా ఉంటారు. తన కుమారుడు అఖిల్ మీద పూర్తి నమ్మకంతో అతడు చేసిన కొన్ని తప్పులను సమర్ధిస్తున్నాడు నాగార్జున. మొదటి సినిమాతోనే డిజాస్టర్ దక్కించుకోవడంతోపాటు 22 కూడా దాటకుండానే పెళ్లి చేసుకుంటానని కంగారు పడి, అన్నయ్య చైతన్య కంటే ముందు ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొన్న అఖిల్.. కొన్నాళ్లకే ఆ రిలేషన్ ను బ్రేకప్ చేసుకొని కొన్నాళ్లపాటు వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. పరిచయం చిత్రం ఫ్లాప్ అవ్వడంతోపాటు.. ప్రేమ పెళ్లి విఫలం అవ్వడంతో డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాడు అఖిల్. అలాంటి సమయంలో నాగార్జున తనయుడు అఖిల్ కి అండగా నిలిచాడు.
దగ్గరుండి మరీ సెటిల్ మెంట్ చేసి శ్రేయాభూపాల్ ఇష్యూ క్లియర్ చేసి, అర్జెంట్ గా విక్రమ్ కుమార్ సినిమా సైన్ చేయించాడు. ఇన్ని చేసిన నాగార్జున ఇప్పుడు “హలో” ప్రమోషన్స్ విషయంలోనూ పాల్గొంటూ.. “అఖిల్ పెళ్లి లేదా ఫస్ట్ సినిమా ఫెయిల్యూర్” గురించి అడిగే క్వశ్చన్స్ కి చాలా డిప్లమేటిక్ గా ఆన్సర్స్ ఇస్తున్నాడు.
“వాడికి చిన్నప్పట్నుంచి నేను ఇచ్చిన ఏకైక వరం “ఇండిపెండెన్స్”, వాడు చాలా ఇండిపెండెంట్ గా పెరిగాడు. వాడి ఇష్టాలను నేనెప్పుడు తప్పుబట్టలేదు. ఒక్కోసారి తప్పు చేస్తాడు, వాటిని మన్నించాలే కానీ బాధించకూడదు” అంటూ సమాధానమిచ్చాడు నాగార్జున. ఇలాంటి తండ్రి ప్రతి ఒక్కరికీ ఉంటే బాగుండు కదూ.