Nagarjuna: యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో నటిస్తున్న నాగ్.. కానీ?

స్టార్ హీరోలలో చాలామంది హీరోలు కొత్త డైరెక్టర్లకు, యంగ్ జనరేషన్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించరనే సంగతి తెలిసిందే. అయితే నాగార్జున మాత్రం కథ నచ్చితే రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కథ అద్భుతంగా ఉందని అనిపిస్తే సొంతంగా ఆ సినిమాను నిర్మించడానికి సైతం నాగ్ వెనుకాడరనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది బంగార్రాజుతో హిట్ అందుకున్న నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో ది ఘోస్ట్ సినిమాలో నటిస్తున్నారు.

అయితే యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో నటించడానికి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అ, కల్కి, జాంబిరెడ్డి సినిమాలతో దర్శకునిగా ప్రశాంత్ వర్మ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రస్తుతం హనుమాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ప్రశాంత్ వర్మ నాగ్ తో పని చేసే అవకాశం దక్కించుకున్నారు. అయితే ప్రశాంత్ వర్మ పని చేస్తుంది నాగ్ సినిమా కోసం కాదు. త్వరలో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్6 ప్రారంభం కానుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ షో సీజన్6 ప్రోమో షూటింగ్ జరుగుతుండగా ప్రశాంత్ వర్మ ఈ ప్రోమోకు దర్శకత్వం వహిస్తుండటం గమనార్హం. త్వరలోనే బిగ్ బాస్6 ప్రోమో రిలీజ్ కానుందని తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్6 లో సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం కంటెస్టెంట్లుగా కనిపించనున్నారు. కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో బిగ్ బాస్ నిర్వాహకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని బోగట్టా.

బిగ్ బాస్ షో సీజన్5 కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో విమర్శలు రావడంతో ఈసారి ఆ పొరపాటు రిపీట్ కాకుండా బిగ్ బాస్ నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత సీజన్లతో పోలిస్తే బిగ్ బాస్ సీజన్6 లో ఎన్నో మార్పులు చేశారని బిగ్ బాస్ సీజన్6 కొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని బోగట్టా.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus