Nagarjuna, Suma: ‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్ వేడుకలో నాగార్జున కామెంట్స్ వైరల్..!

స్టార్ యాంకర్ సుమ కనకాల ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘జయమ్మ పంచాయితీ`. దినేష్ కుమార్, షాలినీ వంటి యువ నటీనటులు ఈ చిత్రం ద్వారా హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు. ‘వెన్నెల క్రియేషన్స్’ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన ‘జయమ్మ పంచాయితీ’ చిత్రాన్ని విజయ్ కుమార్ కలివరపు దర్శకత్వం వహించాడు.ఎం.ఎం.కీరవాణి ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. మే 6న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లను కూడా వేగవంతం చేశారు.

ఈ సినిమాని మొదటి నుండీ స్టార్ హీరోలతో ప్రమోషన్ చేయిస్తుంది సుమ. రానా టీజర్ ను లాంచ్ చేస్తే, పవన్ కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఇక తాజాగా జరిగిన ‘జయమ్మ పంచాయితీ’ ప్రీ రిలీజ్ వేడుకకి నాగార్జున, నాని వంటి స్టార్ హీరోలు హాజరయ్యారు. ఈ క్రమంలో నాగార్జున చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. నాగార్జున మాట్లాడుతూ … “అందరికీ నమస్కారం.. ఇక్కడొక పండగలా ఉంది. ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చినట్టు లేదు. పండగలానే ఉంది.

ఏదో పంచాయితీ పెడుతుంది అని రాలేదు. సుమ పిలవగానే ప్రేమతో ఇక్కడికి వచ్చాను. వేదిక మీదున్న వాళ్లందరికీ నమస్కారం. జయమ్మ పంచాయితీ టీంకి ఆల్ ది బెస్ట్. మీరు ఏమాత్రం.. డైరెక్టర్ గాని, మిగిలిన సాంకేతిక నిపుణులు కానీ.. మా సుమలో ఉన్న ట్యాలెంట్ ఒక 10 శాతం ఈ సినిమాలో పెట్టినా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అవును 10 శాతం చాలు.. గాడ్ బ్లెస్ యు సుమ. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్” అంటూ చెప్పుకొచ్చారు.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Share.